Sarkaru vaari paata రిలీజ్ టెన్షన్.. మహేష్ ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న బ్రహ్మోత్సవం సెంటిమెంట్

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సినిమా యూనిట్ అధికారికంగా సాడ్ న్యూస్ చెప్పింది. సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకరించింది. ఆ ప్రకటనతో పాటు మరో విషయం ఇప్పుడు మహేష్ ఫాన్స్ లో టెన్షన్ కు కారణాం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

 భారీ అంచనాలు

భారీ అంచనాలు

మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమాను వాయిదా వేసుకోవాలని నిర్మాతలు భావించారు.

మే 12వ తేదీన

మే 12వ తేదీన

అందులో భాగంగానే సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీ 2022 వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి మే నెలలో మే 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి నుండి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను వరుసగా ప్రకటిస్తామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే అది కూడా లేకుండా ఇప్పుడు ఫిబ్రవరి 14 నుంచి అప్డేట్స్ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

మే టెన్షన్

మే టెన్షన్

అయితే మహేష్ ఫాన్స్ లో టెన్షన్ ఏమిటంటే కానీ మహేష్ బాబుకు తన సినీ కెరీర్ లో మే నెల పెద్దగా కలిసొచ్చింది లేదు. మే నెలలో ఆయన హీరోగా నాలుగు సినిమాలు రాగా అందులో మూడు సినిమాలు విఫలం అయ్యాయి. ముందుగా ఎస్.జే. సూర్య దర్శకత్వంలో మహేష్ నటించిన `నాని` చిత్రం 2004 మే 14న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన `నిజం` సినిమా 2003 మే 23న విడుదలైంది. ఈ సినిమాకు గాను మహేష్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిజం బోల్తా పడింది.

మే 12వ తేదీన

మే 12వ తేదీన


ఇక ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన `బ్రహ్మోత్సవం` భారీ అంచనాల నడుమ 2016 మే 20న రిలీజై.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా ఒక్కటి హిట్ టాక్ అందుకుంది. నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మంచి ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు వారిలో టెన్షన్ నెలకొంది.

Recommended Video

SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Filmibeat Telugu
కీర్తి టెన్షన్ కూడా

కీర్తి టెన్షన్ కూడా

దానికి తోడు కీర్తి టెన్షన్ కూడా వారిని వెంటాడుతోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటించిన విధానం అందరినీ ఎంతగానో ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఒక్క సినిమాతోనే కీర్తి సురేష్ కి భారీ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆమెకు గ్యాప్ లేకుండా ఆఫర్స్ అయితే వచ్చాయి. అయితే ఈ సినిమా తరువాత ఆమె చేసిన అన్ని సినిమాలు కూడా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. అందుకే మహేష్ బాబు అభిమానులు కీర్తి విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే.. మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సెంటిమెంట్ ఈ సినిమాకి రిపీట్ అవుతుందేమోనని వారు భయపడుతున్నారు. అయితే ఈ సినిమాపై కీర్తి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇది హిట్ కొడితే గనుక.. తన సెంటిమెంట్ బ్రేక్ అయ్యి క్రేజ్ పెరుగుతుందని భావిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X