మెర్సల్ తర్వాత మైఖేల్.. ఆసక్తి రేపుతున్న విజయ్ చిత్రం!
ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దూసుకుపోతున్నాయి. కాస్త పర్వాలేదని టాక్ వచ్చినా వందల కోట్ల వసూళ్లు నమోదవుతున్నాయి. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం విషయంలో అదే జరిగిది. కత్తి, తుపాకీ, తేరి, మెర్సల్, సర్కార్ ఇలా బ్లాక్ బస్టర్ విజయాలతో విజయ్ తమిళంలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. ఇదిలా ఉండగా దర్శకుడు అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఇటీవల పార్రంభం అయిన సంగతి తెలిసిందే.
అట్లీ ఫుట్ బాల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తాడట.నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మనదేశంలో క్రీడారంలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. దీనివలన ఎందరో ప్రతిభ కలిగిన క్రీడాకారులు అవకాశాలు కోల్పోతున్నారు. ఈ అంశాన్నే అట్లీ ఈ చిత్రంలో హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి మైఖేల్ అనే టైటిల్ ని అట్లీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ పాత్ర ఈ చిత్రంలో మైఖేల్ అనే పేరుతో ఉండనున్నట్లు తెలుస్తోంది. దానినే టైటిల్ గా కూడా పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడు. మెర్సల్ చిత్రంలో అట్లీ భర్త వైద్య రంగంపై గురిపెట్టాడు. ఆ చిత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదం సృష్టించింది. తాజాగా విజయ్ టచ్ చేయబోతున్న క్రీడా రంగ అంశం ఎన్ని సంచలనాలకు కారణం అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











