తెలుగులో బేస్ పెంచుకున్న దళపతి విజయ్.. ఆ టాప్ హీరోలకు పోటీగా..
దళపతి విజయ్ తమిళ్ హీరోనే అయినా తెలుగులో కూడా ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. అయితే ఆయన పాపులారిటీ ఈ మధ్య మరింత పెరుగుతోందని తాజాగా ఆయన మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. చివరిగా వారసుడు సినిమాతో తెలుగులో పూర్తి రికవరీ సాధించిన ఆయన... ఇప్పుడు లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీటెయిల్స్ లీక్ అవ్వగా ఆ విషయాలు షాక్ కలిగిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
విజయ్ మార్కెట్ డబుల్:తమిళ అభిమానులందరూ ముద్దుగా దళపతి విజయ్ అని పిలుచుకునే విజయ్... కేవలం తమిళంలోనే కాదు. తెలుగులో కూడా మార్కెట్ నెమ్మదిగా పెంచుకుంటూ వెళుతున్నాడు. దాదాపుగా ఆయన చేస్తున్న సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన వారసుడు అనే సినిమా తెలుగులో రిలీజ్ చేస్తే పూర్తిస్థాయిలో రికవరీ కూడా సాధించేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మార్కెట్ ఈసారి ఏకంగా డబుల్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.

లియోకు కలిసోస్తున్న లోకేష్ మార్కెట్:ప్రస్తుతానికి విజయ్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో లియో అనే సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ముందు నుంచి ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయినట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ కనగరాజు విక్రమ్ సినిమాతోనే కాదు అంతకుముందు చేసిన ఖైదీ సినిమాతో మార్కెట్ పెంచుకున్నాడు. ఇప్పుడు లియోతో విజయ్ కి కలిసొస్తుంది.

లియో కోసం పాతిక కోట్లు:తాజాగా అందుతున్న సమాచారం మేరకు విజయ్ లియో నిర్మాతలు తెలుగు హక్కుల కోసం ఏకంగా పాతిక కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారసుడు సినిమాతో పోలిస్తే ఇది దాదాపుగా డబుల్ అనే చెప్పాలి. అయితే ఒక పక్క లోకేష్ కనగరాజు మార్కెట్ కూడా విజయ మార్కెట్ కి తోడవడంతో విజయ్ సినిమాకి భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయానికి రెండు బడా తెలుగు సినిమాలు ఉన్నా కూడా విజయ్ సినిమాకి మంచి డిమాండ్ ఏర్పడుతోంది.
ఆ హీరోలకు పోటీగా విజయ్ బరిలోకి:నిజానికి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా లియో సినిమా విడుదలవుతున్నప్పుడే రిలీజ్ అవుతోంది. దసరా టార్గెట్ గా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాతో పాటుగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి సర్వం సిద్ధమవుతోంది. అలాంటి రెండు సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ విజయ్ సినిమాకి మంచి మార్కెట్ అయితే ఉందని తెలుగులో విజయ్ మార్కెట్ పెరుగుతోంది అనడానికి ఇదే నిదర్శనమని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లియో:ఈ సినిమాని స్టూడియో 7 బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. లోకేష్ కనగరాజు దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా తెరకెక్కుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయం మీద లోకేష్ కనగరాజు మాత్రం ఇప్పటివరకు ఏ ప్రెస్ మీట్ లో కానీ సోషల్ మీడియాలో గాని స్పందించలేదు.


Click it and Unblock the Notifications











