విజయ్ మామూలోడు కాదు.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొత్త రికార్డ్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ట్విట్టర్ వరల్డ్ లో కేవలం ఒక బర్త్ డే ఫోటోతోనే ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేశారు. ప్రతి హీరో బిర్త్ డేకు ఈ మధ్య కాలంలో CDP అనేది కామన్ గా మారింది. ఆ కామన్ డిస్ ప్లే ఫోటోని అభిమానులే ఇంటర్నెట్ లో వైరల్ చేస్తుండడం ఈ మధ్య కాలంలో ఒక స్టైల్ గా మారింది.
ప్రతి స్టార్ హీరో బర్త్ డేకు అభిమానులు పోటాపోటీగా వారి స్టార్స్ రేంజ్ పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజుకి ఇంకా వారం రోజుల సమయం ఉన్నప్పటికీ అప్పుడే రికార్డులు బద్దలయ్యాయి. ఇక #THALAPATHYBdayFestCDP ఇండియాలోనే అత్యదికంగా ట్రెండ్ అయిన జాబితాలో నిలిచింది. ఇప్పటివరకు 5.2 మిలియన్ ట్వీట్స్ వచ్చయి.

ఇక ముందు ముందు ఇంకా వాటి సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే విజయ్ బర్త్ డే ఈ నెల 22వ తేదీ నాడు. అప్పటివరకు ఈ రికార్డుల సంఖ్య ఆగేలా లేదు. మొన్న ఎన్టీఆర్ బర్త్ డేకు ఇదే తరహాలో 5.2 మిలియన్ ట్వీట్స్ రాగా... అజిత్ బర్త్ డే CDP 4.6 మిలియన్ ట్వీట్స్ తో వారి ఫ్యాన్స్ హంగామా క్రియేట్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, సూర్య, మహేష్ వంటి వారి బిర్త్ డేCDPలు ట్విట్టర్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన జాబితాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











