విజయ్‌తో భార్య విడాకులు.. దళపతిపై సీనియర్ నటుడు షాకింగ్ ఎటాక్!
దళపతి విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తనను మానసికంగా వేధించాడు. ఆయనతో దాంపత్య జీవితాన్ని కొనసాగించలేను అంటూ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేసింది. ప్రస్తుతం విజయ్ వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి భారీగా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలోనే భార్య సంగీత దాఖలు చేసిన పిటిషన్ వివాదాస్పదంగా మారింది. అయితే ఈ నేపథ్యంల ఓ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
విజయ్‌తో విడాకులు కావాలని సంగీత పిటిషన్ దాఖలు చేస్తూ.. మేము మానసికంగా ఎప్పుడో విడిపోయాం. ఆయన మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. దాంతో నేను మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. ఓ దశలో ఆ నటితో తెగతెంపులు చేసుకొంటానని చెప్పి మాట తప్పాడు. ఆ తర్వాత కూడా ఆయన పద్దతి మారలేదు. దాంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే విజయ్‌తో దిగిన సెల్ఫీ ఫోటోను ఆ నటి షేర్ చేసింది. ఆమె చేసిన పనితో ఫ్యామిలీ ప్రతిష్ట, పరువు మంటగలిసింది. ఆ నటితోనే విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాడు. ఆ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేశారు. దాంతో నేను చాలా కుంగిపోయాను. ఆ నటి పేరు ఎందుకు చెప్పడం లేదంటే.. ఆమె పరువు తీయడం నాకు ఇష్టం లేదు. కావాలంటే ఆ నటి, నా భర్త రిలేషన్‌షిప్ గురించిన సాక్ష్యాలు కోర్టుకు సమర్పిస్తాను అని సంగీత పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో నటుడు, పొలిటిషియన్ నెపోలియన్ వీడియో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
విజయ్‌తో సంగీత విడాకుల వివాదం నేపథ్యంలో మాజీ ఎంపీ, సీనియర్ నటుడు నెపోలియన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతున్నది. గతంలో ఆయన విజయ్ తీరును విమర్శిస్తూ.. ఆయన అమ్మా, నాన్నలను సినిమా రంగానికి దూరంగా పెట్టారు. అలాగే భార్యను కూడా సినిమా రంగానికి పరిచయం చేయలేదు. అంతేకాకుండా కూతురు, కొడుకు సినిమా రంగానికి దూరంగా ఉంచాడు. సినిమా రంగంలోనే ఫ్యామిలీని పట్టించుకోకపోవడం గురించి ఆయన తీరుపై నన్ను చాలా మంది ప్రశ్నించారు. ఇదే నిజమైతే.. ఫ్యామిలీనే పట్టించుకోలేని వాడు రేపు ప్రజలను ఏం పట్టించుకొంటాడు? వారి బాగోగులను ఎలా చూస్తాడు? అనేది నాకు సమంజసంగా అనిపిస్తుందని నెపోలియన్ అన్నాడు.
గతంలో నెపోలియన్ చేసిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమంగా కామెంట్ చేస్తున్నారు. సినీ రంగానికి ఫ్యామిలీని దూరంగా ఉంచడం ఆయన వ్యక్తిగతం. అంత మాత్రనా ఓ వ్యక్తిని పూర్తిగా జడ్జ్ చేయకూడదు. కుటుంబ సభ్యులను దూరంగా ఉంచాలని అనుకొన్నాడు. అందులో ఆయన తప్పేమీ లేదు అని అన్నారు. అయితే నెపోలియన్ ఇప్పడు జరుగుతున్న పరిణామాలను గతంలో చెప్పడంపై నెటిజన్లు స్పందిస్తూ.. చాలా కచ్చితంగానే ఆయన ఊహించాడుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











