twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ దళపతి.. లేటుగా అయిన లేటేస్ట్‌గా.. దక్షిణాది రాష్ట్రాలకు విజయ్ విరాళం

    |

    దళపతి విజయ్ సౌత్ సూపర్ స్టార్‌గా ఎనలేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రత్యేకంగా తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత అంతటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్. అయితే కష్టం వచ్చిన ప్రతీసారి విజయ్ ముందుండి సాయం చేస్తూ ఉంటాడు. తన అభిమానుల పట్ల ఎనలేని ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం విజయం ఇచ్చిన విరాళం, ఇచ్చిన పద్దతి చూస్తే నిజంగా సౌత్ సూపర్ స్టార్ అనిపించేలా ఉంది.

    కరోనా అంతా తారుమారు..

    కరోనా అంతా తారుమారు..

    ప్రపంచమంతా కరోనా వైరస్ గుప్పిట్లోకి వచ్చేసింది. విరుగుడు లేని వైరస్‌కు ఇప్పటి వరకు లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 25 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మన దేశంలోనూ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ రావడంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.

    లాక్ డౌన్‌తో ఉపాధి కరువు..

    లాక్ డౌన్‌తో ఉపాధి కరువు..

    కరోనా వైరస్‌ను కట్డడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత నెల నుంచి అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. దినసరి కూలీలు ఉపాధి లేక బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు తారలు ముందుకు వచ్చారు.

    సినీ కార్మికులకు అండగా..

    సినీ కార్మికులకు అండగా..

    సినిమా పరిశ్రమ మూతపడటంతో సినీ కార్మికులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. అయితే వీరిని ఆదుకునేందుకు అన్ని భాషల తారలు ముందుకు వచ్చారు. వారి వారి ఇండస్ట్రీలకు విరాళాలు ఇచ్చారు. కొందరు పక్క రాష్ట్రాలకోసం కూడా విరాళాలు ఇచ్చారు. తాజాగా దళపతి విజయ్ ఇచ్చిన విరాళం, దాన్ని పంచిన విధానానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

    Recommended Video

    Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
    మొత్తంగా కోటీ ముప్పై లక్షలు..

    మొత్తంగా కోటీ ముప్పై లక్షలు..

    విజయ్ మొత్తం కోటీ ముప్పై లక్షలను విరాళంగా ప్రకటించాడు. ఇందులో ప్రధాన మంత్రి నిధికి రూ. 25 లక్షలు, తమిళ నాడు ముఖ్యమంత్రి నిధికి 50లక్షలు, దక్షిణ భారత నటీనటుల సంఘాం (ఫెఫ్సీ)కి 25 లక్షలు, కేరళకు 10 లక్షలు, ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు, పుదుచ్చెరికి 5 లక్షలు, కర్ణాటకకు 5 లక్షలు ప్రకటించాడు. ఇలా దక్షిణ రాష్ట్రాలన్నింటికి విరాళం ఇచ్చిన ఏకైక హీరోగా విజయ్ నెటిజన్ల మనసు దోచుకున్నాడు. అందుకే #RealHeroThalapathyVIJAY అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

    English summary
    Thalapathy Vijay Donated To FEFSI And PM Relief Fund. And All Southern CM Relief Fund. Earlier Nayanthara, Ajith, Lawrence, Rajinikanth Also Donated To FEFSI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X