Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Thalapathy Vijay: అందుకే విజయ్ అంటే పడి చచ్చేది.. నడవలేని అభిమానిని ఎత్తుకొని ఏం చేశాడంటే..
కోలీవుడ్ సినిమా ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ పెంచుకోవడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా పెంచుకుంటున్న హీరోలలో విజయ్ మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు. గత ఐదేళ్ల కాలంలో అతని మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఫ్యాన్స్ అతన్ని ఎందుకు ఇష్టపడతారో ఇటీవల మరొక ఫోటో ద్వారా రుజువైంది. కాళ్లు లేని ఒక అభిమానిని ఎత్తుకున్న విజయ్ ఊహించని విధంగా కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

నెంబర్ వన్ లో విజయ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఫాన్స్ కూడా నచ్చే విధంగా ఎన్నో కమర్షియల్ అంశాలను కూడా సినిమాలో ఉండే విధంగా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక గత ఐదేళ్ల కాలంలో అయితే అతని మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో అందరికంటే ఎక్కువ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరోగా అతనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్
విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరుగుతుంది. ఒకప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్ సినిమాల కోసమే జనాలు ఎక్కువ స్థాయిలో ఎగబడే వారు. కానీ ఇప్పుడు విజయ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎక్కువ స్థాయిలో ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. అతను ఎక్కడికి వెళ్లినా కూడా జన సంద్రోహం అయితే ఊహించిన విధంగా కనిపిస్తోంది.

ఫ్యాన్స్ కోసం సహాయం
ఇక విజయ్ ఫ్యాన్స్ ను కూడా చాలా బాగా లైక్ చేస్తూ ఉంటాడు. గతంలో కూడా అతను ఎంతోమంది అభిమానులకు సహాయం కూడా చేశాడు. కొన్నిసార్లు అయితే ప్రచారాలు చేయకుండా అతను సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఆ సహాయం గురించి ఫాన్స్ బయటకు కూడా చెప్పుకున్నారు. ఆ విధంగా అతను తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు.

ఫ్యాన్స్ తో ఫొటోస్
ఇక ఇటీవల ప్రత్యేకంగా విజయ్ తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను కలుసుకునేందుకు డిసైడ్ అయ్యాడు. తనకోసం తమిళనాడు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ ను విజయ్ కలుసుకొని ప్రత్యేకంగా ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశాడు. వారి ఇష్ట ప్రకారమే ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి వారి గురించి అడిగి తెలుసుకున్నాడు.
|
అభిమానిని ఎత్తుకున్న విజయ్
అయితే ఒక అభిమాని నడవలేని స్థితిలో విజయ్ దగ్గరకు రావడంతో అతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. విజయ్ ను ఆ ఫ్యాన్ ఫోటో కావాలని అడగడంతో వెంటనే ఎత్తుకొని ఫోటోకు స్టిల్ ఇచ్చాడు. అంతేకాకుండా అతని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తన నుంచి ఏమైనా సహాయం కావాలి అంటే కూడా చేస్తానని చెప్పడంతో ఆ అభిమాని ఎంతగానో సంతోషించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.