For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy birthday vijay: ఆ ఒక్క మాటతో అభిమానిని పెళ్లి చేసుకున్న విజయ్.. ఖరీదైన కార్లు కలిగిన హీరో!

  |

  కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఒకప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో హడావిడిగా కనిపించే వారు. కానీ గత కొన్నేళ్లుగా విజయ్ డామినేషన్ మొదలైంది. ఇక నేడు విజయ్ 47వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు భారీ స్థాయిలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక విజయ్ లైఫ్ లో అతని పెళ్లి చాలా విబిన్నంగా జరిగింది. ఇక అతనికి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.. ఆ విషయాలపై ఒక లుక్కేస్తే..

  64సినిమాల్లో తెలుగు కథలు కూడా

  64సినిమాల్లో తెలుగు కథలు కూడా

  పక్క ఇండస్ట్రీల మార్కెట్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ తమిళ్ సినిమాతో అంతకంతకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యనే తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పటివరకు 64 సినిమాలు చేసిన విజయ్ ఒక్కడు, పోకిరి వంటి తెలుగు రీమేక్ సినిమాలతో కూడా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు.

  దర్శకుడి తనయుడిగా

  దర్శకుడి తనయుడిగా

  విజయ్ ఫ్యామిలి విషయానికి వస్తే.. తమిళ డైరెక్టర్ చంద్రశేఖర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విజయ్ బాలనటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అనంతరం మెల్లగా రొమాంటిక్ ప్రేమ కథల నుంచి యాక్షన్ కథల వరకు వచ్చాడు. సినిమా సినిమాకు అభిమానుల సంఖ్యను కూడా పెంచుకుంటూ వచ్చాడు.

  అభిమానిని పెళ్లి చేసుకున్న విజయ్

  అభిమానిని పెళ్లి చేసుకున్న విజయ్

  ఇక విజయ్ తన అభిమానిని పెళ్లి చేసుకున్నాడని చాలామందికి తెలియదు. విజయ్ భార్య పేరు సంగీత. చాలాసార్లు ఆమె విజయ్ షూటింగ్ చూసేందుకు లొకేషన్స్ కు వెళుతుండేది. యూకేలోనే కుటుంబ సభ్యులతో ఉన్న ఆమె కొన్నిసార్లు ప్రత్యేకంగా విజయ్ కోసమని ఇండియాకు వచ్చేవారు. ఆమెను గమనించిన విజయ్ ఒకేసారి పిలిచి మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు.

  ఆ మాటలకు విజయ్ ఫిదా

  ఆ మాటలకు విజయ్ ఫిదా

  నేను మీకు పెద్ద అభిమానిని మీరంటే నా ప్రాణం అని సంగీత ఒక సాధారణ అభిమానిలా సంతోష పడుతూ చెప్పడంతో విజయ్ ఆమెకు చాలా తొందరగా కనెక్ట్ అయ్యాడు. కొన్నాళ్లకు వారి సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు. ఇక పెద్దలు కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో 1999లోనే వివాహం జరిగింది.

   విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ

  విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ

  సంగీత - విజయ్ లకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు పేరు సంజయ్. అతను త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కూతురు దివ్యా షాశా ఇదివరకే తేరి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. విజయ్ ఎంత బిజీగా ఉన్నా కూడా అతను తన కుటుంబ సభ్యులకు ఏ మాత్రం దూరంగా ఉండడు.

   విజయ్ లగ్జరీ కార్లు

  విజయ్ లగ్జరీ కార్లు

  ఇక విజయ్ కు కార్లంటే చాలా ఇష్టం. అతని దగ్గర ఉన్నన్ని కాస్ట్లీ బ్రాండ్ కార్లు సౌత్ లో మరెవరి దగ్గర లేవు. విజయ్ లగ్జరీ కార్ల వివరాల్లోకి వెళితే.. రోల్స్ రాయిస్ ఘోస్ట్ - సుమారు 6 కోట్లు,

  ఆడి ఎ 8 - 1.30 కోట్లు, BMW సిరీస్ 5 - 75లక్షలు,
  BMW X6 - 90 లక్షలు, మినీ కూపర్ 35లక్షలు.

  Actor Gopichand Inspiring Life Story | Filmibeat Telugu
   విజయ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

  విజయ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

  ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకు మినిమమ్ 100కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. దాదాపు అతని మార్కెట్ మొత్తం కోలీవుడ్ లోనే సాలీడ్ గా ఉంది. దిల్ రాజు , వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో చేయబోయే సినిమాకు కూడా 100కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక నెల్సన్ దర్శకత్వంలో చేస్తున్న బీస్ట్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయవచ్చని సమాచారం.

  English summary
  Vijay is one of the most fan following heroes in the Kollywood film industry. Once upon a time Rajinikanth Kamal Haasan was seen rushing with a series of box office hits. But Vijay’s dominance over the past few years has begun. Today is Vijay's 47th birthday and a large number of fans on social media are wishing him well. And in Vijay's life, his marriage was very different. And he loves luxury cars .. if you take a look at those things .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X