HBD Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి ఎన్ని వందల కోట్లంటే.. రజనీ కంటే ఎక్కువా? తక్కువా?

తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. అభిమానులంతా దళపతిగా పిలుచుకునే ఆయన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగిన ఆయన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జూన్ 22న దళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలు, రాజకీయాల వైపు అడుగులు, ఆయన సంపద గురించి పరిశీలిస్తే..

బాటనటుడిగా ఎంట్రీ
ఎస్ఏ చంద్రశేఖర్, శోభ చంద్రశేఖర్ దంపతులకు 22 జూన్ 1974న మద్రాస్‌లో జన్మించారు విజయ్. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళంలో పేరున్న దర్శకుడు. చెన్నై లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో చేరిన విజయ్ సినిమాల మీద పిచ్చితో మధ్యలోనే చదువు ఆపేశారు. తండ్రి దర్శకుడు కావడంతో పదేళ్ల వయసులోనే బాలనటుడిగా పలు సినిమాల్లో నటించారు విజయ్. ఆ తర్వాత 1992లో నాలయ తీర్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. అనంతరం వరుస బ్లాక్‌బస్టర్లతో యూత్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్నారు.

Thalapathy Vijay Net Worth Here s the Jana Nayagan Actors remuneration and Assets Details

డబ్బింగ్ చిత్రాలతో తెలుగు వారి ముందుకు
విజయ్ నటించిన డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారికి కూడా పరిచయమయ్యారు. 2000వ సంవత్సరం నుంచి తమిళనాట విజయ్ శకం మొదలైంది. గిల్లీ, ఖుషీ, ఫ్రెండ్స్, బద్రీ, షాజహాన్, యూత్, భగవతి వంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌తో అగ్రనటుడిగా దూసుకొచ్చారు. సీనియర్లు రజనీ, కమల్ హాసన్‌లకు గట్టి పోటీ ఇచ్చిన విజయ్.. కమల్ తప్పుకోవడంతో రజనీని ఢీకొట్టారు. తమ సమకాలీకులు అజిత్, సూర్య, విక్రమ్ వంటి స్టార్స్‌ను దాటేసి ఇళయ దళపతిగా నిలిచారు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా విజయ్ కొత్త చరిత్ర సృష్టించాడు.

టీవీకేని స్థాపించిన విజయ్
దాదాపు మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన విజయ్‌ను ఎన్నో అవార్డులు వరించాయి. మూడు సార్లు తమిళనాడు స్టేట్ అవార్డ్స్, సైమా, ఎడిషన్ అవార్డులు ఆయనను వరించాయి. తమిళనాడు ప్రభుత్వం 1998లో కలైమామణి పురస్కారంతో విజయ్‌ని సత్కరించింది. ఇన్నేళ్లు తనను ఆదరించి ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం విజయ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే విజయ్‌కి తొలి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్ధతు ప్రకటించగా ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే భారీ విజయం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దూకారు. ప్రస్తుతం తన 69వ చిత్రం జన నాయగన్ తన కెరీర్‌లో ఆఖరి సినిమా అని విజయ్ ప్రకటించారు.

భారత్‌లో సంపన్న నటుల్లో ఒకడిగా
ఒకప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న విజయ్ ఇప్పుడు తమిళనాడుతో పాటు భారతదేశంలో సంపన్న నటుట్లో ఒకరు. సామాజిక మాధ్యమాలు, ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ వెలువరించిన వివరాల ప్రకారం విజయ్ ఆస్తుల విలువ రూ.500 కోట్లు పైమాటే. తమిళ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ కంటే కూడా విజయ్ సంపద ఎక్కువని కోలీవుడ్ టాక్. ఆయన సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. దీనితో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో విజయ్ ఏడాదికి రూ.150 కోట్లకు పైగా సంపాదిస్తారని కోలీవుడ్ వర్గాల సమాచారం.

విజయ్ ఆస్తులు ఇవే
ఆయనకు చెన్నైలో సముద్ర తీరానికి అభిముఖంగా విలాసవంతమైన బంగ్లా ఉంది. విజయ్ గ్యారేజీలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ ఎక్స్ 5, ఆడీ ఏ8 ఎల్, రేంజ్ రోవర్ ఎవాక్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో ఎక్స్‌సీ 90, మెర్సెడెస్ బెంజ్ జీఎల్ఏ వంటి కోట్లు విలువ చేసే ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి జన నాయగన్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు విజయ్. అదే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి రాజకీయ దిగ్గజాలను ఢీకొట్టనున్నారు. దళపతి ఎంట్రీతో తమిళ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. విజయ్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీ బీట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X