Remuneration: విజయ్ చివరి మూవీకి పారితోషికం అన్ని వందల కోట్లా? ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్‌తో గుడ్ బై!
ఒక హీరో లేదా హీరోయిన్ తాలూకా స్టామినా తెలియాలి అంటే వారి క్రేజ్ తో పాటుగా వారి సినిమాల తాలుకా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ లపై కూడా ఆధారపడి కొలుస్తారు. కాగా ఇలా హీరో సహా హీరో లేదా హీరోయిన్ లు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. ఇలానే నిర్మాతలు ఇచ్చే పారితోషికాలు కూడా ఆధారపడి ఉంటాయి. మరి ఇపుడు ఉన్న ట్రెండ్ లో ఒకో రేంజ్ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు.
అయితే ఇండియా లోనే రెంటునరేషన్ ని తీసుకుంటున్న స్టార్ హీరోలు ఎవరు అనే ప్రస్తావన వస్తే చాలా వరకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ స్టార్స్ సహా కోలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా వస్తున్నాయి. అయితే హిందీ మార్కెట్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వారి పేర్లు భారీ రెమ్యునరేషన్ అత్యధికంగా తీసుకునేవారి లిస్ట్ లో నిలిస్తే తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాకి ఈజీగా 100 నుంచి 150 కోట్లు తీసుకునే ఏకైక హీరోగా నిలిచాడు.

కానీ వీరి కంటే అత్యధిక మొత్తంలో ఊహించని రెమ్యునరేషన్ ని ఇపుడు దక్షిణాది ఓ స్టార్ హీరో చివరి సినిమాకి అన్నట్టుగా పలు షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు. తమిళ సినిమా నాట ఒకో సినిమా చేస్తూ రజినీకాంత్ ని మించిన మార్కెట్ తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దళపతి అట. కాగా విజయ్ కి మార్కెట్ పెరిగిన నాటి నుంచి తాను ఊహించని మొత్తంలో ఆఫర్ చేసినా నిర్మాతలు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు.
తన బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కానీ రిలీజ్ కి ముందే వచ్చే సోషల్ మీడియా రెస్పాన్స్, ఓటిటి ఆఫర్స్ చూసి విజయ్ కి 100 200 ఏంటి కోట్ల రెమ్యునరేషన్ అడిగినా ఇచ్చేస్తున్నారట. కాగా విజయ్ తన లేటెస్ట్ చిత్రమే "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" కే 200 కోట్లకి పైగా రెమ్యునరేష ని తీసుకున్నాడని నిర్మాతలే చెప్పేసారు. అయితే విజయ్ ఈ సినిమా తర్వాత ఒక్క 69వ సినిమాని చేసి సినిమాలు ఆపేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు.
మరి ఈ లాస్ట్ సినిమా ఎవరితో ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం చాలా నెలలు నుంచి సస్పెన్స్ గానే మిగిలిపోగా నేడు ఫైనల్ గా ఎట్టకేలకి ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తమిళ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమాని ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాకి విజయ్ అందుకుంటున్నపే చెక్ వింటే షాక్ అవ్వాల్సిందే.
మొత్తం జీఎస్టీ తో కలిపి విజయ్ రెమ్యునరేషన్ ఈ చిత్రానికి 275 కోట్లు అట. దీని బట్టి విజయ్ క్రేజ్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మన తెలుగులో ఇదే బడ్జెట్ తో జక్కన్న బాహుబలి 2 ని తీసేసాడు. అలాంటిది ఇపుడు విజయ్ ఈ రేంజ్ పారితోషికాన్ని అందుకోవడం మైండ్ బ్లాకింగ్ నెంబర్ అని చెప్పాలి. ఇక తమిళ్ నుంచి అయితే రజినీకాంత్ కూడా సినిమాకి 200 కోట్లకి పైగానే ఛార్జ్ చేస్తున్నారని టాక్ ఉంది కానీ ఈ రేంజ్ లో అయితే తాను కూడా అందుకోలేదనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











