అభిమానుల తోపులాటలో స్టార్ హీరో విజయ్‌కి గాయాలు.. పోలిసుల లాఠీ చార్జ్!
స్టార్ హీరో విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ హీరోగా అభిమానులని సొంతం చేసుకున్న విజయ్ ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తమిళనాడు వ్యాప్తంగా విజయ్ కి అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇటీవల విజయ్ అఖిల భారత అభిమాన సంఘం అధ్యక్షుడు ఆనంద్ కుమార్తె వివాహం పాండిచ్చేరిలో జరిగింది.
ఈ వివాహానికి విజయ్ హాజరవుతున్నాడని ముందుగా తెలియడంతో కల్యాణ మండపం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. విజయ్ రావడంతో ఒక్కసారిగా అభిమానుల మధ్య తోపులాట జరిగింది. విజయ్ కారు దిగి వధూవరులని ఆశీర్వదించాడు వెళ్ళేసరికే తోపులాటని బౌన్సర్లు కూడా ఆపలేక పోయారు.

ఈ తోపులాటలో విజయ్ కింద పడడం, కాలికి చిన్న గాయం కావడం కూడా జరిగిపోయింది. దీనితో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాహానికి విజయ్ తన సతీమణి సంగీత సమేతంగా హాజరయ్యాడు. విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











