పాకిస్తాన్ జైల్లో అల్లు అర్జున్ కి ఫ్యాన్స్.. షాకింగ్ విషయాలు చెప్పిన యువ దర్శకుడు
ఇప్పుడు ఇండియన్ సినిమా వైడ్ గా భారీ మార్కెట్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో కనిపించే చాలా తక్కువమంది పేర్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు సెపరేట్ గా రాయాల్సిందే అని చెప్పాలి. కాగా తనకి ముందు చాలామంది హీరోలు ఉండి ఉండొచ్చు అలాగే అల్లు అర్జున్ పై పలు ట్రోల్స్ కూడా ఉండొచ్చు కానీ ఇండియా వైడ్ గా తనకి ఉన్న క్రేజ్ కానీ ఫాలోయింగ్ కానీ ఒక్క మన తెలుగు హీరోస్ లోనే కాకుండా ఏ ఇతర ఇండస్ట్రీలో హీరోస్ కి కూడా లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా ఇలా ఐకాన్ స్టార్ భారీ మార్కెట్ ని తను సొంతం చేసుకోగా దాదాపు ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ కి భారీ ఫాలోయింగ్ అన్ని ముఖ్య భాషల్లో కూడా ఉంది. కాగా ఇలా ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే పాన్ ఇండియా లెవెల్లో రీచ్ తను ఎప్పుడో సొంతం చేసుకున్నాడు కానీ ఇపుడు పుష్ప సినిమాలతో భారీ వసూళ్ళు సాధించి ప్రూవ్ చేసుకున్నాడు.

అయితే ఇపుడు ఇంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం బయటకి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒక్క ఇండియా లోనే కాదట. మన శత్రు దేశం పాకిస్తాన్ లో కూడా ఉందని ఇపుడు తెలిసింది. కాగా ఈ విషయాన్ని రివీల్ చేసింది ఎవరో కాదు రీసెంట్ గా తండేల్ సినిమాతో భారీ హిట్టు కొట్టిన ఎవరు దర్శకుడు చందు మొండేటి.
అక్కినేని నాగచైతన్య అలాగే సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాత్రలు పాకిస్తాన్ జైల్లో ఉంటారు, మరి నిజ జీవితంలో కూడా ఉన్న పాత్రలు ఒక షాకింగ్ విషయాన్ని దర్శకుడు చందు మొండేటికి చెప్పారట పాకిస్తాన్ జైల్లో కూడా అల్లు అర్జున్ ప్రస్తావనొచ్చేదని అక్కడ కూడా అక్కడ కూడా బన్నీని ఇష్టపడే వాళ్ళు ఉన్నారని అలాగే అక్కడ ఓ సెంట్రి బన్నీ ఫ్యాన్ కూడా అని చెప్పారట నిజ జీవిత మత్స్యకారులు.

చందు మొండేటికి అప్పుడు చెప్పారట. దీనితో బన్నీ హవా ఒక్క ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా ఉందని చెప్పాలి. అయితే అక్కడ మన తెలుగు సినిమాలు కూడా గట్టిగానే చూస్తారని కూడా వాళ్ళు చెప్పినట్టు చందూ మొండేటి రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేయడం జరిగింది.
మరి ఇలా మన శత్రు దేశంలో కూడా అభిమానుల్ని సొంతం చేసుకోడం అనేది ఐకాన్ స్టార్ కే చెల్లింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టగా ఈ సినిమా తర్వాత మరిన్ని భారీ సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. అలాగే వీటిలో తనకి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ సినిమా తను చేయబోతున్నాడు. దీనిని రాజమౌళి కూడా టచ్ చెయ్యని జానర్లో తెరకెక్కిస్తున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











