తొలి సినిమాకు 5 వేల రెమ్యునరేషన్, ఇప్పుడు నిమిషానికే కోట్ల పారితోషికం .. ఆ హీరో ఎవరో తెలుసా?

వినోదంతో పాటు సామాజిక చైతన్యాన్ని అందించేందుకు భారతదేశంలో ప్రవేశించిన సినిమా ఇప్పుడు లక్షల మందికి ఉపాధి కల్పించే అతిపెద్ద పరిశ్రమగా. ఇండియాలోని పలు భాషల్లో కలిపి ప్రతియేటా వందలాది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే భారతీయ చిత్ర పరిశ్రమ వేల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది. తన మార్కెట్‌ను కూడా నెమ్మదిగా విస్తరిస్తోంది. మనదేశంలోని నటీనటులు హాలీవుడ్ స్టార్స్‌కి ఏమాత్రం తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వీరిలోని ఒక హీరో గురించి చూస్తే :

ప్రస్తుతం ఇండియలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో టాలీవుడ్ స్టార్స్ ముందు వరుసలో ఉన్నారు. మార్కెట్, ఇమేజ్‌లకు అనుగుణంగా దేశంలోని అన్ని ఇండస్ట్రీల హీరోలు రూ. వందల కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొందరు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటాను కూడా తీసుకుంటే.. ఇంకొందరు మాత్రం కొన్ని ఏరియాల ప్రాఫిట్స్‌ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. ప్రస్తుతం ఓ సినిమా నిర్మాణ వ్యయంలో పారితోషికాలకే నిర్మాతలు పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు.

that star hero now charges Rs 4 5 crore per minute as a remuneration here s the details

హీరోల రెమ్యునరేషన్ విషయంలో ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. నిర్మాతలు సైతం తమ సంగతి కాస్త ఆలోచించాలని.. హీరోలు రెమ్యునరేషన్ తీసుకుని వెళ్లిపోతారని, కానీ నష్టం వస్తే ఆ భారం పడేది తమ మీదే పడుతుందని ప్రొడ్యూసర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తాపడితే అయితే కొందరు హీరోలు పెద్ద మనసుతో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం, రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందేనంటూ డిమాండ్లు సైతం ఊపందుకున్నాయి.

ఈ సంగతి పక్కనబెడితే.. నిమిషానికి రూ. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఓ హీరో విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్. హిందీ బడా నిర్మాతల్లో ఒకరైన వీరూ దేవగణ్ కుమారుడైన ఆయన ఫూల్ ఔర్ కాంటేతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నివేదికల ప్రకారం.. అజయ్ దేవగణ్ తన మొదటి సినిమాకు పారితోషికంగా రూ.5000 అందుకున్నారట. కానీ ఆ తర్వాత జిగర్, విజయ్‌పథ్, దిల్‌వాలే, జాన్, దిల్జాలే , ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, హమ్ దిల్ దే చుకే సనమ్‌ వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు అజయ్ దేవగణ్.

that star hero now charges Rs 4 5 crore per minute as a remuneration here s the details

భారత్‌లో హయ్యెస్ట్ పెయిడ్ హీరోలలో ఒకరైన అజయ్ దేవగణ్ .. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కోసం ఆయన ఏకంగా రూ.35 కోట్ల పారితోషికంగా తీసుకున్నారట. అజయ్ ఈ సినిమాలో కనిపించింది కేవలం 8 నిమిషాలు మాత్రమే. అంటే నిమిషానికి రూ.4.5 కోట్ల పారితోషికం అన్నమాట. ఇదే కాదు.. కొన్ని సినిమాలకు అజయ్ లాభాలలో 50 శాతం వాటాను తీసుకున్నారు. దాంతో తానాజీ, దృశ్యం వంటి సినిమాలకు ఆయన రెమ్యునరేషన్ రూ.100 కోట్లకు పైనే ఉంది.

సినిమాలే కాదు ఓటీటీలలోనూ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్‌లో అజయ్ దేవగణ్ ముందువరుసలో ఉంటారు. నివేదికల ప్రకారం.. రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ 7 ఎపిసోడ్‌లకు గాను రూ.125 కోట్లను పారితోషికంగా తీసుకున్నారట. అంటే ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు. ఇది పంకజ్ త్రిపాఠి, మనోజ్ బాజ్‌పేయ్, సైఫ్ అలీ ఖాన్‌లు ఒక షోకి వసూలు చేసేదాని కంటే ఎక్కువ. తన కష్టం, ప్రతిభతో రూ.5000 రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి నిమిషానికి రూ. కోట్లలో పారితోషికంగా అందుకునే రేంజ్‌కు చేరుకున్నారు అజయ్.

More from Filmibeat

Read more about: ajay devgn movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X