twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    200 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా హిట్టా? ఓటీటీలో సక్సెస్ ఎలా లెక్కించాలంటే.. మనోజ్ బాజ్‌పేయ్

    |

    లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు ఓటీటీలే వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. పలు చిన్న, వైవిధ్యమైన సినిమాలు, మంచి కంటెంట్‌తో వచ్చిన వెబ్ సిరీస్‌లు అద్భుతమైన రెస్పాన్స్‌ను కూడగొట్టుకొంటున్నాయి. అయితే కలెక్షన్లు లెక్కించే వెసులుబాటు లేకపోవడం ప్రేక్షకులకు, సినీ అభిమానులకు ఓ రకమైన ఉత్సాహం కొరవడుతున్నదనే విషయంపై ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ మనోజ్ బాజ్‌పేయ్ ఘాటుగా స్పందించారు. ఆ విషయాల్లోకి వెళితే...

    ఓటీటీలతో థియేటర్లకు ఢోకా ఏమీ లేదు

    ఓటీటీలతో థియేటర్లకు ఢోకా ఏమీ లేదు

    ఓటీటీలు వచ్చినంత మాత్రాన థియేటర్లకు వచ్చిన ఢోకా ఏమిలేదు. ఒకసారి పరిస్థితులన్నీ సవ్యంగా మారిన తర్వాత థియేటర్లు ఓపెన్ అవుతాయి. ప్రేక్షకులు హాయిగా థియేటర్లకు వెళ్లి సినిమాలను ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. థియేటర్, ఓటీటీ మధ్య పోటీ ఇంకా పెరుగుతుంది. ఈ రెండు పరిశ్రమల మధ్య గీత గీసి వేర్వేరుగా చూడటం మంచిది కాదు. ఈ రెండింటిలోను నటులు, దర్శకులు పనిచేయడానికి అవకాశం కలుగుతుంది అని మనోజ్ బాజ్‌పేయ్ అన్నారు

    100 నుంచి 200 కోట్లు వసూలు చేస్తే

    100 నుంచి 200 కోట్లు వసూలు చేస్తే

    అయితే సినిమా సక్సెస్‌ కొలమానం కేవలం బాక్సాఫీస్.. సినిమాలు సాధించే కొలమానంగా చూడకూడదు. ఏదైనా సినిమా 100 నుంచి 200 కోట్లు వసూలు చేస్తే దానిని సక్సెస్‌గా చూడటం అన్ని సమయాల్లో కుదరదు. ఎందుకంటే సినిమా కోసం పెట్టిన పెట్టుబడి, ఆ సినిమా వల్ల వచ్చిన రాబడిని పోల్చి చూడాలి. పెట్టుబడి కంటే రాబటి ఎక్కువ వస్తే అప్పుడే సక్సెస్‌గా పరిగణించాలి అని మనోజ్ బాజ్‌పేయ్ తెలిపారు.

    టాక్ చెప్పేలా ప్రేక్షకుడు తృప్తి పొందాలి

    టాక్ చెప్పేలా ప్రేక్షకుడు తృప్తి పొందాలి

    ఏదైనా సినిమా 100 కోట్లు వసూలు చేసిందనే విషయంతో ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి పెదవి విరిచిన సందర్బాలు ఎక్కువగానే ఉంటాయి. 100 కోట్లు వచ్చినంత మాత్రాన ప్రేక్షకుడు ఆ సినిమా హిట్ అయిందని చెప్పలేడు. కానీ ఏదైన మంచి మూవీ గానీ, వెబ్ సిరీస్‌ గానీ చూసిన తర్వాత అది బాగుందని ప్రేక్షకుడు ఏ మాత్రం సందేహం లేకుండా తన టాక్‌ను అందరితో పంచుకొంటున్నాడు. దాంతో ఓటీటీలో సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడుతున్నది అని మనోజ్ బాజ్‌పేయ్ పేర్కొన్నారు.

    ఓటీటీ సక్సెస్‌ను ఎలా చూడాలంటే...

    ఓటీటీ సక్సెస్‌ను ఎలా చూడాలంటే...


    ఓటీటీలో సినిమాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి వాటికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ పెరుగుతున్నాయి. ఓటీటీ యూజర్లు చెల్లించే సబ్‌స్క్రిప్షన్ వల్ల ఆదాయం పెరుగుతున్నది. దాని వల్ల సినిమాలకు మరింత ఆదాయం ఓటీటీ కంపెనీలకు, నిర్మాతలకు వస్తున్నది. దీనిని ఎందుకు సక్సెస్‌గా భావించకూడదు అని మనోజ్ బాజ్‌పేయ్ పేర్కొన్నారు.

    నాకు నచ్చి వెబ్ సిరీస్ ఇవే..

    నాకు నచ్చి వెబ్ సిరీస్ ఇవే..

    ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లో నాకు బాగా నచ్చినది ఫార్గో. అలాగే మేడ్ ఇన్ హెవెన్, పాతాల్ లోక్ వెబ్ సిరీస్‌ కూడా బాగా నచ్చాయి. వాటిని నేను ఒక ఆడియెన్ మాదిరిగానే చూశాను. ఏదైనా మంచి మూవీ, వెబ్ సిరీస్ చూస్తే.. వెంటనే దానికి సంబంధించిన యూనిట్ సభ్యులను, యాక్టర్లకు ఫోన్ చేసి అభినందిస్తాను అని మనోజ్ బాజ్‌పేయ్ తెలిపారు.

    English summary
    The Family Man 2 fame Manoj Bajpai made clear defination of Box office and OTT Success. He says, If film collects 200 crores at box office. It's not treated as Hit. We need to compare the budget and revenue the movie gets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X