షూటింగ్స్‌కి బ్రేక్.. ఇష్టమైన వారితో విజయ్ దేవరకొండ చిల్!
స్టార్ కిడ్స్ , అతిరథ మహారథులున్న తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తన ఓన్ టాలెంట్‌తో స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగారు విజయ్ దేవరకొండ. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్నా చితకా పాత్రలు , సెకండ్ హీరోగా నటిస్తూ మేకర్స్ కల్లలో పడ్డారు విజయ్. ఇలాంటి దశలో పెళ్లిచూపులు ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది .. ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి ఈ రౌడీ స్టార్‌లోని మరో కోణాన్ని ప్రపంచానికి చూపింది. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి నటించిన గీతా గోవిందం క్లాసికల్ మూవీగా భారీ వసూళ్లు సాధించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
వరుస విజయాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకరిగా స్థానం దక్కించుకున్నారు. యూత్ ఆయన యాక్టింగ్‌కు , వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయారు. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ ద్వారా ఆయన పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిరాశపరిచినా, విజయ్ వల్లే ఆ సినిమాకు ఆ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయని ఆయన ఫ్యాన్స్ చెబుతుంటారు.

లైగర్ తర్వాత చేసిన ఖుషి, ది ఫ్యామిలీమెన్ సినిమాలు కూడా బొక్కబోర్లాపడటంతో విజయ్ డైలమాలో పడ్డారు. స్టోరీల ఎంపికల విషయంలో ఆయన జడ్జిమెంట్ పవర్ తగ్గిందని, ట్రెండ్‌ని పట్టుకోకుండా రోటీన్ సినిమాలు తీసి బోల్తాపడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ ఆ ప్రాజెక్ట్స్ కోసం మేకోవర్ అవుతున్నారు. రాహుల్ సంకృత్యాన్ మూవీ పీరియాడికల్ డ్రామాగా తెలుస్తోంది. ఇప్పటికే అమ్మవారి శిల్పం బ్యాక్‌డ్రాప్‌లో రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది.
తను ఇండస్ట్రీలో స్టార్ కావడంతో తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సోదరుడిని నిలబెట్టేందుకు స్వయంగా సినిమాలు నిర్మిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. ఎన్నోసార్లు తమ్ముడిపై తన ప్రేమను చాటుకున్న విజయ్ .. అతని సినిమా ఈవెంట్స్‌కు హాజరవుతూ ప్రమోషన్స్‌లోనూ భాగం పంచుకుంటున్నాడు. ఇక బేబీతో సూపర్‌హిట్ కొట్టిన ఆనంద్.. గం గం గణేషాతో ట్రాక్ తప్పాడు. ప్రస్తుతం డ్యూయెట్ సినిమాలో నటిస్తున్న ఆయన మరోసారి విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అమెరికాలోని హాలీవుడ్‌లో అమ్మానాన్న, తమ్ముడితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు రౌడీ స్టార్. యూనివర్సిల్ స్టూడియో ముందు ఫ్యామిలీతో విజయ్ దిగిన ఫోటోలతో పాటు తన తల్లితో బోటుతో వెళ్తున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫారిన్ ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే తన రెగ్యులర్ షూట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొంటాడని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











