పవన్ చేతుల్లో ఆ ఇద్దరు హీరోయిన్ల భవిష్యత్తు... ఇంకెంత కాలం వెయిట్ చేయాలో?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఇద్దరు హీరోయిన్లు మాత్రం తమ భవితవ్యం అంతా పవన్ కళ్యాణ్ మీదే ఆధారపడి ఉండడంతో కాస్త టెన్షన్ గానే ఉన్నారు. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

పవన్ సక్సెస్ ను సినిమా ఇండస్ట్రి అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. కానీ ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు హీరోయిన్ల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. ఆయన ఓ రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసి, రిలీజ్ అయ్యాక వాటి రిజల్ట్ తోనే వీళ్లిద్దరికి అవకాశాలు వస్తాయా రావా అన్నది ఆధారపడి ఉంది. ఆ ఇద్దరు హీరోయిన్లు మరెవరో కాదు ప్రియాంక అరుల్ మోహన్, నిధి అగర్వాల్.

The future of the two heroines is currently in the hands of Power Star Pawan Kalyan

ముందుగా నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకుంటే ఈ హాట్ బ్యూటీకి ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్స్ లేకుండా పోయాయి. దీంతో అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీలో నటించే అద్భుతమైన అవకాశం దక్కింది నిధికి. కానీ ఆ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ పడుతూ ఇప్పటికి రిలీజ్ కాలేదు. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తేనే నిధి అగర్వాల్ కు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

The future of the two heroines is currently in the hands of Power Star Pawan Kalyan

ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న మరో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఈ బ్యూటీ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ మూవీ యావరేజ్ గా నిలవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. రీసెంట్ గా ఓజి సినిమాలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని కొట్టేసింది ప్రియాంక.

అయితే పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు అంటూ బిజీ బిజీగా ఉండడంవల్ల ఈ మూవీ షూటింగ్ కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రియాంక టాలీవుడ్ భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ ఓజి రిజల్ట్ పైనే ఆధారపడి ఉంది. ఈ రకంగా ప్రస్తుతం ఇద్దరూ యంగ్ బ్యూటీల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉందన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X