The Warrior : రామ్ 'ది వారియర్' రిలీజ్ డేట్ వచ్చేసింది.. థియేటర్స్ లో ఇక రచ్చే
నేను శైలజ సినిమా తర్వాత మరో హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిన హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చాడు.. అయితే ఆ తర్వాత ఆయన చేసిన రెడ్ అనే ప్రయోగాత్మక సినిమా అనుకున్నంత మేర ఆకట్టుకోలేదు. నేను శైలజ సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో రెడ్ సినిమా చేయగా ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.. ఈ నేపథ్యంలోనే రామ్ లింగుస్వామితో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ వివరాలు

ఫ్యాక్షన్ నేపథ్యంలో
రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. సమంత యూటర్న్, గోపీచంద్ సీటీమార్ సినిమాలను నిర్మించిన శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా కథ పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని ప్రచారం జరగగా అనూహ్యంగా ఈ సినిమాలో రామ్ హీరో అని ప్రకటించి షాక్ ఇచ్చారు.

రిలీజ్ డేట్
సినిమా యూనిట్ ప్రకారం ఈ సినిమాలో రామ్ ఫుల్ ఎనర్జీతో.. మాస్ అటిట్యూడ్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు రామ్. అయితే, ది వారియర్ థియేటర్ రిలీజ్ డేట్ ను అనూహ్యంగా ఫిక్స్ చేశారు మేకర్స్.

జులై 14న ప్రపంచ వ్యాప్తంగా
ఈ ఏడాది జులై 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుందని ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ తో పాటు రామ్ కూర్చుని ఉన్న ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చేతిలో గన్ పట్టుకున్న రామ్ పోతినేని చాలా ఆవేశంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

జూలై 13న షూటింగ్ మొదలు
రైల్వే స్టేషన్ లో ఓ నిందితుడి కోసం ఎదురుచూస్తున్నట్టు రామ్ కూర్చుని ఉన్నారు. ఇక రామ్ చేతికి ఉన్న బుల్లెట్ గాయం చూస్తుంటే ఈ సినిమా ఆకట్టుకునేవిధంగానే కనిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. గత ఏడాది జూలై 13న ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టగా జులై 14న రిలీజ్ కానుంది. అంటే సరిగ్గా ఏడాదిలో లోపు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ఆది పినిశెట్టి విలన్ గా
లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'ది వారియర్'లో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా గ్లామర్ హీరోయిన్ కృతి శెట్టి రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూటర్న్ సినిమాను నిర్మించిన నిర్మాత శ్రీనివాస చిట్టూరి తన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











