తమిళ దర్శకుడికి హీరో రామ్ క్షమాపణలు.. కంగారులో మర్చిపోయానంటూ ట్వీట్‌

సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంటర్ అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. హీరోగా పరిచయమైన కొత్తలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా సంపాదించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇక, ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'రెడ్' అనే సినిమాతో మరో విజయాన్ని కూడా అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామితో 'ద వారియర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని చాలా రోజుల క్రితమే ప్రకటించినా.. ఆ తర్వాత కోవిడ్ సెకెండ్ వేవ్ రావడంతో షూటింగ్‌ను మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను పున: ప్రారంభించి వరుసగా పలు షెడ్యూళ్లను కూడా చకచకా పూర్తి చేశారు. అలా అంతా సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే హీరో రామ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను మరోసారి బ్రేకిచ్చి.. ఆ వెంటనే టాకీ పార్టును దాదాపుగా పూర్తి చేశారు.

పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ద వారియర్' మూవీ భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళంలో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌లో రామ్ స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ కాప్‌ గెటప్‌తో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. అంతేకాదు, ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటి నుంచే చాలా మంది బయ్యర్లు పోటీ పడుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ సినిమా రైట్స్‌ ఇప్పటికే భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు వార్తలు వస్తున్నాయి.

The WARRIORR: Ram Pothineni Says Sorry to Director Lingusamy

తాజాగా 'ద వారియర్' మూవీ నుంచి 'విజిల్' సాంగ్‌ను విడుదల చేశారు. ఇందుకోసం ఓ ప్రెస్‌మీట్‌ను కూడా నిర్వహించారు. అయితే, అందులో హీరో రామ్ ఓ పొరపాటు చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన అతడు.. ట్వీట్‌తో దర్శకుడు లింగుసామికి క్షమాపణలు చెప్పాడు. 'కంగారులో ప్రధానమైన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, నా దర్శకుడు లింగుసామి సార్.. మీరు ఈ చిత్రంలోని ప్రతి ఒక్క ఫ్రేమ్‌ను మీ భుజాలపై వేసుకున్నారు. నేను ఇప్పటివరకు పని చేసిన అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా నిలిచినందుకు ధన్యవాదాలు. సారీ అండ్ లవ్ యూ' అని రామ్ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

The WARRIORR: Ram Pothineni Says Sorry to Director Lingusamy

క్రేజీ కాంబోలో రూపొందిన 'ద వారియర్' మూవీలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది జూలై 14న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X