twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు వారి శాడిజం, ఇపుడు వీరి నిర్లక్ష్యం.. దీన్ని ఆపేదెవరు? మంచు మనోజ్ ఆవేదన

    |

    జీవితం అంటే కేవలం పరీక్షలు మాత్రమే కాదు... ఇంకా చాలా ఉందని నటుడు మంచు మనోజ్ అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై వారు స్పందిస్తూ... చిన్న వయసులోనే విద్యార్థులపై ర్యాంకుల కోసం ఒత్తిడి పెంచడం సరికాదు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొన్ని సందర్బాల్లో వారు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    ఇంటర్మీడియట్ బోర్డులో చాలా బ్లండర్స్ ఉన్నాయి. వారి నిర్లక్ష్యమే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం అవుతోంది. కొందరు చేసిన తప్పులకు విద్యార్థులు బలవుతున్నారు. ఇలాంటి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు వీటిని ఆపుతారు? విద్యార్థులే మన భవిష్యత్, మన నమ్మకాన్ని నిలబెట్టేది వారే. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలనని మనోజ్ తెలిపారు.

    అప్పుడు వారి శాడిజం, ఇపుడు వీరి నిర్లక్ష్యం

    అప్పుడు వారి శాడిజం, ఇపుడు వీరి నిర్లక్ష్యం

    కేవలం నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసి చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఒకప్పుడు కార్పొరేట్ కాలేజీమేనేజ్మెంట్స్ శాడిజం, ర్యాంకులు సాధించాలని వారిపై పెట్టే ఒత్తడి వల్ల జరిగేవి. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్ల అలాంటివి జరుగుతున్నాయి.

    ఫెయిల్యూర్ వచ్చినపుడు సపోర్టుగా ఉండండి

    ఫెయిల్యూర్ వచ్చినపుడు సపోర్టుగా ఉండండి

    ‘‘అందరు తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. మీ పిల్లలకు సపోర్టుగా ఉండండి, ఫెయిల్యూర్స్ వచ్చినపుడు వాటి నుంచి ఎలా బయటపడాలో చెప్పి ఎంకరేజ్ చేయండి. వారిలో ధైర్యం నింపి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.' అని మనోజ్ వ్యాఖ్యానించారు.

    టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్ కాదు.. అదొక అనుభవం

    టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్ కాదు.. అదొక అనుభవం

    ‘జీవితం అనేది చాలా చిన్నది. మన వాళ్లు, మనల్ని ప్రేమించేవారు మనకు అండగా ఉంటే దాన్ని సింపుల్‌గా లీడ్ చేయవచ్చు. టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్ అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అన్నారు.

    ప్రేమ పెటాకులైంది... తెలుగు హీరోను వదిలేసిన బాలీవుడ్ బ్యూటీ?ప్రేమ పెటాకులైంది... తెలుగు హీరోను వదిలేసిన బాలీవుడ్ బ్యూటీ?

    కేటీఆర్ మీద నమ్మకం ఉంది

    కేటీఆర్ మీద నమ్మకం ఉంది

    నాకు కేటీఆర్ గారి మీద చాలా నమ్మకం ఉంది. ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఈ ఇష్యూలో న్యాయం చేస్తారు. సింపుల్‌గా ట్వీట్ చేసి అందరిలో భరోసా నింపారు. ఈ ర్యాంకుల రేసు వెనక ఉన్న కాలేజీలపై దృష్టి పెట్టాలని, ర్యాంకుల కోసం విద్యార్థులపై ప్రెజర్ పెడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మనోజ్ ట్వీట్ చేశారు.

    చదువు అనేది ఆత్మగౌరవం కాదు

    చదువు అనేది ఆత్మగౌరవం కాదు

    ‘‘చదువు కేవలం నాలెడ్జ్ గెయిన్ చేసుకునే సాధనం, భవిష్యత్తకు బాటలు వేసుకునే మార్గం. అంతేకానీ చదువు అనేది ఆత్మగౌరవం ఎంతమాత్రం కాదు. ప్రియమైన విద్యార్థురాలారా, తల్లిదండ్రులారా ఇంటర్మీడియట్ బోర్డు విషయంలో జరిగిన దానికి భయాందోళనకు గురి కాకుండా అధికారుల గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి.'' అని మనోజ్ సూచించారు.

    English summary
    "There is life beyond examinations...I condemn the pressure put up on the students at such an age where they are vulnerable to take up their own lives without second thoughts." Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X