ప్రభాస్‌కు పెళ్లి కాకపోవడానికి అసలు కారణం ఇదే! ఇన్నాళ్లకు బయటపెట్టిన పాన్ ఇండియా స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ పేరుకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిన విషయమే. కేవలం తెలుగు రాష్ట్రాలు, ఇండియా వైడ్‌గా మాత్రమే కాదు వరల్డ్ వైడ్‌గా ఈ భారీ కటౌట్‌కు అభిమానులు ఉన్నారు. అలాగే ఈయనకు ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు. అయితే ఇదంతా ప్రొఫెషనల్ లైఫ్ పరంగా. కానీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఈయన ఇప్పటికే సింగిల్‌గానే ఉంటున్నారు. 50ఏళ్లకు చేరువవుతున్నా, తోటీ నటులకు పెళ్లిలు అయి పిల్లలు పుడుతున్నా ఈయన మాత్రం బ్యాచిలర్ లైఫ్‌లో నుంచి బయటకు రావట్లేదు. మరి ఇంతటి పేరు, డబ్బు సంపాదించి కూడా ఇంత కాలం తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో వివరించారు రెబల్ స్టార్ ప్రభాస్. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం..
బాహుబలి ముందు వరకు టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్లో పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ వాళ్లు కూడా క్యూ కడుతున్నారు. అలా తనకు వచ్చిన క్రేజ్‌తో వరుస సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టిన ప్రభాస్ కంటెంట్ పరంగా హిట్ టాక్‌ను తెచ్చుకోవడానికి చాలా సమయమే తీసుకున్నారు. ఈ మధ్యే సలార్‌తో మంచి హిట్‌ను అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇప్పుడు ఆయన చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి.

అయితే ప్రభాస్ పర్సనల్ విషయానికొస్తే ఆయనకు ఇంకా పెళ్లి కాలేదన్న సంగతి తెలిసిందే. దాదాపు ఆయన వయసున్న పవన్ కల్యాణ్ మూడు పెళ్లిలు చేసుకుని ముందుకెళ్తే, మహేశ్ బాబు ఇద్దరు పిల్లలు కని వారిని పెద్ద కూడా చేసేశారు. గోపిచంద్, శర్వానంద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని.. ఇలా చాలా మంది హీరోలు వివాహ జీవితంలోకి అడుగుపెట్టి లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఎందుకింకా పెళ్లి చేసుకోవట్లేదని చాలా మందికి అర్థం కాని విషయం. ఎప్పుడూ చూడు దీనిమీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.

ఆ మధ్యలో రెండు మూడు సార్లు ప్రభాస్ పెద్దమ్మ, దివంగత నటుడు కృష్ణం రాజు భార్య శ్యామల దేవీని డార్లింగ్ పెళ్లి గురించి అడిగితే ఏవేవో కారణాలు చెప్పుకొచ్చింది. త్వరలోనే చేస్తాం, మంచి అమ్మాయి కుదరాలిగా ఇలా ఏవో చెప్పింది. మరోవైపు సెలబ్రిటీల జాతకాలు చెబుతాం అంటూ చెప్పుకునే తిరిగే వేణుస్వామి ఏమో సోషల్ మీడియాలో ప్రభాస్ పర్సనల్, పెళ్లి లైఫ్ గురించి ఏవేవో చెబుతూ ఫ్యాన్స్‌ను భయపెడుతూ ఉంటాడు. సరే ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ప్రభాస్ మాత్రం తన పెళ్లిపై ఎప్పుడూ నోరు విప్పడు. ఏదో సిగ్గు పడుతూ తప్పించుకుని తిరుగుతూ ఉంటారు.
అయితే తాజాగా ఆయన గతంలో పెళ్లికి సంబంధించి మాట్లాడిన మాటలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆ వీడియో ఆయన అనుష్కతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తనకు నాకు ఏమైన మనస్ఫర్థలు వస్తే అభిమానులు ఏమీ సాల్వ్ చేయలేరు కదా. నన్ను వదిలేయండి. ఇలా ఉండనివ్వండి అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. ప్రస్తుతం దీనికి సంబంధించిన నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











