ఐశ్వర్యతో విడాకులు అందుకే.. ఆ విషయంలో ధనుష్ ఏం చేశాడంటే.. సన్నిహితుడు లీక్!
ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ విడిపోవడం అభిమానులను షాక్‌కి గురి చేసి ఉండవచ్చు, అయితే ఈ జంటకు సన్నిహితులకు మాత్రం ఆశ్చర్యం కలిగించ లేదు. సోషల్ మీడియా పోస్ట్‌లో, ఈ జంట తమ విడిపోయినట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాన్ని గౌరవించాలని మరియు తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. అయితే ఈ జంట విడిపోవడానికి అసలు కారణాలు ఒక సన్నిహితుడు వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే

ధనుష్-ఐశ్వర్య విడిపోవడానికి ఏమి దారి తీసింది?
ఈ జంటకు స్నేహితుడు కూడా అయిన ఒక నటుడు(పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) ఈ విషయం మీద జాతీయ మీడియాకు కొన్ని వివరాలు వెల్లడించారు. "ధనుష్ ఒక వర్క్‌హోలిక్. అతనికి తెలిసిన ఎవరైనా అతను అన్నింటికంటే తన పనికె ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పగలరు. అతని వర్క్ కమిట్‌మెంట్‌లు - ఆ కారణంగా అనేక నగరాల మధ్య ప్రయాణం సహా అవుట్‌డోర్ సినిమా షూట్‌లకు రోజుల తరబడి బయట ఉండాల్సి రావడం అతని ఫామిలీ లైఫ్ ను దెబ్బతీసింది." అని వెల్లడించాడు.

ఐశ్వర్యతో గొడవ జరిగిన ప్రతిసారీ
సాధారణంగా ప్రతి భార్య భర్త మధ్య ఉన్నట్టు ధనుష్-ఐశ్వర్యల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవట. అయితే ధనుష్- ఐశ్వర్య ఏ విధమైన ఘర్షణ గురైనా సరే ప్రతిసారీ, ఆయన ఒక కొత్త సినిమాకు సంతకం చేస్తాడట. బహుశా ఆయన తనను తాను పనిలో నిమగ్నమై ఉండేలా చూసుకుంటాడని అంటున్నారు. "ధనుష్ గురించి తెలిసిన ఎవరికైనా, అతను చాలా ప్రైవేటు వ్యక్తి అని ఆయన అంటున్నారు.

టెన్షన్‌కు గురైనప్పుడల్లా
ధనుష్ తన సన్నిహిత మిత్రులతో కూడా, ఎక్కువ విషయాలు షేర్ చేసుకునేవాడు కాదని ఆయన వెల్లడించారు. ధనుష్ మనస్సులో ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ధనుష్ ఐశ్వర్యతో లేదా ఏదైనా ఇతర టెన్షన్‌కు గురైనప్పుడల్లా, అది ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. అలా ఘర్షణ జరిగిన ప్రతి సారి ధనుష్ వెళ్లి కొత్త సినిమాకు సంతకం చేస్తాడు అని అంటున్నారు.

ప్రమోషన్స్ పూర్తి చేయాలని
తన విఫలమైన సంబంధం నుండి బయటపడటానికి ఆయన ఎక్కువ తన పని మీద దృష్టి పెడుతూ వచ్చాడని, అది వారిద్దరి రిలేషన్ మరింత చెడిపోయేందుకు బాగా సహాయ పడింది అని ఆయన వెల్లడించారు. వారి విడిపోవడానికి సంబంధించి ఒక ప్రకటన జారీ చేయడానికి ముందు జంట కూర్చుని చాలా సేపు చాట్ చేశారు అని ఆయన వెల్లడించారు. ధనుష్ ఈ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేలోపు ఆత్రంగి రే సినిమా ప్రమోషన్స్ పూర్తి చేయాలని అనుకున్నాడు. "ఆత్రంగి రే యొక్క మొత్తం ప్రమోషన్లను పూర్తి చేసి ఈ ప్రకటన చేయడానికి సిద్ధమయ్యారు.

చాలా ముఖ్యం
మరోవైపు, ఐశ్వర్య ఫిట్‌నెస్ వ్యాపారాలు చేస్తోంది. అలాగే ఆమె చేపట్టే స్వచ్ఛంద సంస్థలు మరియు మహిళా సాధికారత ప్రాజెక్టుల వంటి వాటిని కూడా అమల్లోకి పెట్టనుంది. వారి పిల్లలు - యాత్ర మరియు లింగ. ఇప్పుడు వారు పెద్దవారైనందున, వారు ఈ విడిపోతున్న వార్తలు వారికి తెలియజేయడం కూడా చాలా ముఖ్యం, "అని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











