వాళ్లే జీవితంలో ముఖ్యం, ఐ లవ్ యూ చెప్పండి: విజయ్ దేవరకొండ ఎమోషనల్ వీడియో!
Recommended Video

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ పేజీ ద్వారా ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగులో భాగంగా గత రెండు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్న విజయ్ ఇటీవలే హైదరాబాద్ వచ్చారు.
క్రిస్మస్‌కు సందర్భంగా అభిమానులను మిస్సవ్వడంతో వారి కోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చారు. దేవరసాంటా అవతారం ఎత్తి రౌడీ బాయ్స్ అందరికీ బహుమతులు అందించే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటి? విజయ్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారో చూద్దాం.

దేవరసాంటా
‘‘క్రిస్మస్ అయిపోయింది. న్యూఇయర్ వచ్చేసింది. క్రిస్మస్‌కు మీ ముందుకు ‘దేవర సాంటా'గా రావాలనుకున్నాను. లేటయింది, కానీ మర్చిపోలేదు. శాంటా ట్రెడిషన్ కొనసాగించాలనుకుంటున్నాను. మీరంతా రౌడీ యాప్‌లో మనీలోకి వెళ్లి ‘DEVERASANTA' అనే కోడ్ అప్లై చేయండి. నా నుంచి మీ అందరికీ క్రిస్మస్ గిఫ్ట్ వస్తుంది.'' అని విజయ్ దేవరకొండ తెలిపారు.

మమ్మీ చాలా కోపంగా ఉంది
మా మమ్మీ చాలా కోపంగా ఉంది. అలిగింది. రెండు నెలల నుంచి నేను కాకినాడ షూటింగులో ఉన్నాను. రెండు రోజుల క్రితం వచ్చాను. వచ్చినప్పటి నుంచి డబ్బింగ్, షూటింగ్, మీటింగ్స్ తో బిజీగా గడిచిపోయింది. మమ్మీని కూల్ చేయడానికి ఒక హగ్ ఇవ్వాలనుకుంటున్నాను.
వాళ్లే ముఖ్యం, ఐ లవ్ యూ చెప్పండి
మనం అందరం అమ్మా నాన్నకు ఐ లవ్ యూ పెద్దగా చెప్పం. ఎందుకో మనకు ఆ అలవాటు పోతుంది. వాళ్లే మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాం, కానీ ఐ లవ్ యూ చెప్పం. ఈ న్యూఇయర్ మనం దీన్ని అలవాటు చేసుకుందాం. మీరంతా ఇలా చేసి వీడియోలు షేర్ చేయండి. మీరు చేసే వీడియోలు చూడాలని ఉందని విజయ్ తెలిపారు.

డియర్ కామ్రేడ్
హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో జోడీ కడుతున్నారు. మీరు ప్రేమించే దానికోసం యుద్ధం చేయండి.. ఫైట్ ఫర్ వాట్ యు లవ్.. అనే ట్యాగ్ లైన్ తో డియర్ కామ్రేడ్ సినిమా వస్తుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











