Don't Miss!
- News
VIVO: వీవో కంపెనీ డైరెక్టర్లు దేశం వదిలి చైనాకు జంప్,ఈడీ దెబ్బతో జింగ్ జాంగ్,జస్ట్ రూ. 10 వేల కోట్లు గోల్ మాల్
- Lifestyle
Asthma: ఆస్తమాకు సరైన సమయంలో చికిత్స అందివ్వకపోతే..ఈ ప్రధాన సమస్యలతో పాటు ప్రాణాంతకం అని తెలుసుకోండి..
- Finance
Dolo-650: డోలో-650 తయారీదారుపై ఐటీ రైడ్స్.. కీలక పత్రాల పరిశీలన.. 40 ప్రాంతాల్లో..
- Sports
Womens Hockey World Cup 2022: కివీస్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే క్వార్టర్స్ బెర్త్!
- Technology
Vodafone IdeaVi యొక్క ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ప్రయోజనాలలో కొత్త చేరికలు
- Automobiles
డీలర్షిప్ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
థమ్స్ అప్ విజయ్ దేవరకొండ స్పెషల్ ఎడిషన్.. మామూలు క్రేజ్ కాదుగా ఇది!
45 ఏండ్ల కింద తయారీ మొదలైన సాఫ్ట్ డ్రింక్ 'థమ్స్ అప్' క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు అది కస్టమర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే తాజాగా థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ రౌడీ హీరో 'విజయ్ దేవరకొండ' ను ఆ సంస్థ ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జనవరి నెల్లో అధికారికంగా ప్రకటించారు. నిజానికి 90ల నుంచి 'థమ్స్ అప్' బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఇండియన్ యాక్టర్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, చిరంజీవి, మహేష్ బాబు యాడ్ ఫిల్మ్ లో నటించారు. టాలీవుడ్ నుంచి మ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా మొదట మెగాస్టార్ 'చిరంజీవి', ఆ తర్వాత సూపర్ స్టార్ 'మహేశ్ బాబు' వ్యవహరించారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పెళ్లి చూపులు సినిమాతో గుర్తింపు తెచ్చుకుని 'అర్జున్ రెడ్డి'తో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఐదేండ్లలో మెగాస్టార్, సూపర్ స్టార్ ల రేంజ్ ను చాలా తక్కువ సమయంలోనే బీట్ చేయడం విశేషం. థమ్స్ అప్ యాడ్ ఫిల్మ్ లో కూడా రౌడీ స్టైల్ వేరే లెవల్ ఉందన్న సంగతో తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ థమ్స్ అప్ లో విజయ్ దేవరకొండ స్పెషల్ ఎడిషన్ వదిలారు. విజయ్ ముద్దు పేరు 'రౌడీ' అని తెలిసిందే, ఇప్పుడు రౌడీ స్పెషల్ అంటూ విజయ్ ఫొటోతో ఉన్న డ్రింక్స్ విడుదల చేశారు. ఇప్పుడు విజయ్ అభిమానులు ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఎడిషన్ డ్రింక్స్ ఫోటోలు వైరల్ కావడంతో వెంటనే వార్తలాలలోకి ఎక్కింది. విజయ్ అభిమానులు థమ్స్ అప్ డబ్బాలతో పోజులిచ్చిన ఫోటోలు అంతటా వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో లైగర్ మూవీ పూర్తి చేశాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని తర్వాత కూడా పూరి డైరెక్షన్ లో జనగణమన మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు. జనగణమన కంటే ముందే విజయ్ దర్శకుడు శివ నిర్వాణతో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఖుషి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతామని విజయ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.