twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్‌కు ముందే సినిమా లీక్.. ఇంటిని కూడా అమ్మేసి రోడ్డుపైకి ఫ్యామిలీ.. నేలపైనా పడుకొన్నాం.. టైగర్ ష్రాఫ్

    |

    బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్ తమ కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందులను మీడియాతో పంచుకొన్నారు. బాల్యంలో తన తండ్రి జాకీ ష్రాఫ్ నిర్మించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తమ కుటుంబం ఎలా అప్పుల్లో కూరుకుపోయిందనే చేదు విషయాన్ని గుర్తు చేసుకొంటూ...

    2003లో బూమ్ చిత్రం

    2003లో బూమ్ చిత్రం

    మా నాన్న ఆయేషా ఫ్రాఫ్ ప్రొడక్షన్ హౌస్‌లో 2003లో బూమ్ అనే చిత్రాన్ని నిర్మించారు. బూమ్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, గుల్షన్ గ్రోవర్, మధు సప్రే, పద్మా లక్ష్మీ, జీనత్ ఆమన్, జీనత్ ఆమన్ నటించారు. ఈ చిత్రం ద్వారానే కత్రినా కైఫ్ తన కెరీర్‌ను బాలీవుడ్‌లో ప్రారంభించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

    రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో బూమ్

    రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో బూమ్

    బూమ్ సినిమా పైరసీ బారిన పడటంతో డిస్టిబ్యూటర్లు వెనుకడుగు వేశారు. కానీ నాన్న జాకీ ష్రాఫ్ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. దాంతో మా తలరాత ఒక్కసారిగా తిరుగబడింది. నష్టాలను తండ్రి జాకీ ష్రాఫ్ భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని టైగర్ ష్రాఫ్ అన్నారు.

    పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాం

    పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాం

    బూమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో మేము పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాం. ముంబైలోని బాంద్రాలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను అమ్మేశాం. ఆ తర్వాత ఓ చిన్న ఇంట్లోకి అద్దెకు దిగాం. అప్పడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో మాటల్లో చెప్పలేం. ఆ పరిస్థితులు గుర్తుకు వస్తే చాలా భయమేస్తుంటుంది అని టైగర్ ష్రాఫ్ అన్నారు

    బూమ్ ఫ్లాప్‌తో ఆర్థిక పరిస్థితి దారుణంగా

    బూమ్ ఫ్లాప్‌తో ఆర్థిక పరిస్థితి దారుణంగా

    బూమ్ సినిమా చాలా దారుణమైన అనుభవాన్ని చూపించింది. ఇంట్లో ఫర్నీచర్ కూడా అమ్మివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా అమ్మ వేసిన ఆర్ట్ వర్క్, విలువైన వస్తువులను కూడా అమ్మేశాం. నాన్న స్టార్‌గా ఉన్నప్పుడు నా కోసం మంచి బెడ్ కొన్నారు. అది కూడా అమ్మేశాం. చిన్న ఇంట్లో నేను నేల మీద పడుకొన్నాను. అలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా దారుణమైనవి అని టైగర్ ష్రాప్ తెలిపారు.

    చిన్నతనంలో పేదరికంతో

    చిన్నతనంలో పేదరికంతో

    ఆర్థికంగా, విలాసవంతంగా జీవితాన్ని గడిపే పరిస్థితి నుంచి పేదరికంలోకి నెట్టి వేయ బడటంతో జీవితం చాలా భారంగా మారింది. చిన్న వయసులోనే నేను కష్టపడాల్సి వచ్చింది. కుటుంబం కోసం చిన్న చిన్న జాబ్స్ కూడా చేశాను అని అన్నారు. బూమ్ సినిమా ఒక్కసారిగా మా జీవితాలను రోడ్డుపైకి ఈడ్చింది. ఆ తర్వాత మళ్లీ మంచి రోజులు రావడంతో నాన్న, నేను కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాం అంటూ టైగర్ ష్రాప్ తెలిపారు.

     టైగర్ ష్రాఫ్ కెరీర్ అలా..

    టైగర్ ష్రాఫ్ కెరీర్ అలా..

    జాకీ ష్రాప్ నట వారసుడిగా టైగర్ ష్రాఫ్ హీరోపంతి అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత భాఘీ, ఏ ఫ్లయింగ్ జా్, మున్నా మైఖేల్, వెల్‌కమ్ టు న్యూయార్క్, భాఘీ2, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, వార్, భాఘీ3, హీరోపంతి2 చిత్రాల్లో నటించారు.

    English summary
    Tiger Shroff about his family bankruptcy due to Boom movie leaked online. He said to bollywood media that their Bandra apartment to move into a smaller house
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X