twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    200 కేజీల బరువు ఎత్తిన స్టార్ హీరో.. వీడియో వైరల్

    |

    నేటి తరం హీరోలందరూ ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి సారిస్తున్నారు. ప్రాంతీయ భాషా చిత్రాల కంటే బాలీవుడ్‌లో ఇది కొంచెం ఎక్కువే అని చెప్పాలి. అక్కడి హీరోలందరూ చొక్కాలిప్పేసే సీన్లు ప్రత్యేకంగా పెడుతూ ఉంటారు. అందుకోసం నిరంతరం జిమ్‌లో కసరత్తులు చేస్తూనే ఉంటారు. ఇక, యాక్షన్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అయితే ఎప్పుడూ ఫిట్‌నెస్ మీదే దృష్టి సారిస్తుంటారు. దీనికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా టైగర్ ఓ అరుదైన ఫీట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

    Tiger Shroff lift massive 200 kgs

    బాలీవుడ్‌లోనే యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ జిమ్‌లో ఏకంగా రెండు వందల కేజీల బరువును ఎత్తేశాడు. ట్రైనర్ పక్కనే ఉండగా.. అతడి సూచనల ప్రకారం అంతటి బరువును సునాయాసంగా లేపేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అతడిపై అభిమానులే కాకుండా, సినీ ప్రియులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

    టైగర్ ష్రాఫ్‌.. హృతిక్‌తో కలిసి నటించిన ఈ సినిమా 'వార్'. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు భారీ స్పందన వచ్చింది.

    English summary
    Bollywood Handsome Hero Tiger Shroff shocked his fans by lifting a massive 200 kgs. Bollywood's action hero took to his Instagram handle and shared the video which went viral instantly. Watch the video to have a look at his unbelievable workout session.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X