Tillu Square: అనుపమపై అలాంటి బూతు కామెంట్స్.. వార్నింగ్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ

అందాల భామ అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరో హీరోయిన్లుగా తొలిసారి నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును బుధవారం హైదరాబాదులో నిర్వహించారు. ఇక ఆ ఈవెంటుకు హీరోయిన్ అనుపమ హాజరు కాలేదు. దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అనుపమ అప్సెట్ అయి.. ఈవెంటుకు రాలేదని తెలుస్తోంది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

ఒక్కసినిమాతో స్టార్....:డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇండస్ట్రీలో పదేళ్లకు పైగానే ఉన్నప్పటికీ.. అంతగా గుర్తింపు సాధించలేకపోయాడు. ఇక ఒకే ఒక్క సినిమాతో సూపర్ హిట్టును అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్ధు. అయితే ఆ సినిమాకు సీక్వెల్ రూపొందిన విషయం తెలసిందే. టిల్లు స్క్వేర్ అనే పేరుతో సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సారి దర్శకుడు నరుడా డోనరుడా ఫేం మల్లిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

Tillu Square Siddu Jonnalagadda warning to those who made vulgar comments about Anupama Parameshwaran News Goes Viral

ఈవెంటుకు రాని అనుపమ...:ఇక టిల్లు స్క్వేర్ సినిమా రేపు అనగా మార్చి 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కి సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు... కానీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాత్రం రాలేదు. అయితే అనుపమ పరమేశ్వరన్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటో తెలిపారు సిద్ధు.

అనుపమ మీద వల్గర్ కామెంట్స్...:అసలు విషయం ఏంటంటే... ప్రీ రిలీజ్ ఈవెంటు కోసం ఓ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఆ పోస్టర్లో అనుపమను చూసి నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు. దానికి కారణం.. అనుపమ చెయ్యి.. సిద్ధు బాడీ మీద ఉంటుంది. దాన్ని చూసిన కొంతమంది.. అసభ్యకరమైన స్థితిలో ఉందంటూ అనుపమ మీద వల్గర్ కామెంట్స్ చేశారు. ఈ విషయం వల్లే తను ప్రీ రిలీజ్ ఈవెంటుకు రాలేదని సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ చెప్పుకువచ్చాడు.

Tillu Square Siddu Jonnalagadda warning to those who made vulgar comments about Anupama Parameshwaran News Goes Viral

ట్రోల్స్ ఓ పరిమితి వరకు ఓకే...:హీరోలు, హీరోయిన్లు అన్నాక సోషల్ మీడియాలో ట్రోల్స్ కి టార్గెట్ అవడం కామన్ అన్న సిద్ధు... కానీ అది కొంతవరకే ఉండాలని సూచించారు. అలా అని నేను ఇప్పుడు మిమ్మల్ని ఆర్డర్ వేయలేను... దయచేసి ఇకమీదట హీరోయిన్లు కానీ ఇతర నటీమణులు కానీ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినప్పుడు వారి మీద ట్రోలింగ్ ఒక పరిమితి వరకు చేస్తే బాగుంటుందని చెప్పుకువచ్చాడు.

సిద్దు వార్నింగ్..:మనం ఎవరినైనా ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు.. ఆ ఫ్లర్ట్ చేయడం అవతలి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అంతే కానీ... అది బలవంతం చేస్తున్నట్లే అనిపించొద్దంటూ వెల్లడించారు. ఇక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని చేయని వాళ్ళు మాట్లాడే మాటలు చేసే కామెంట్లు అవి అంటూ వారికి వార్నింగ్ ఇచ్చాడు సిద్ధు. ఇక మీదట ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించాడు. ప్రస్తుతం సిద్దు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X