40 ఏళ్ల వయస్సులో పెళ్లి పీఠలెక్కబోతున్న టాలీవుడ్ హీరో.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాక్ !

ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలు లేదా హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారి కుటుంబాల్లో వరుసగా పెళ్లి బజాలు మ్రోగుతున్నాయి. తాజాగా మరో టాలీవుడ్ హీరో త్వరలో పెళ్లిలెక్కబోతున్నారట. 40 ఏండ్ల లేటు వయస్సులో పెళ్లి పీటలు ఆ తెలుగు హీరో ఎవరో ఓ లూక్కేయండి.

ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు. నారా వారబ్బాయి నారా రోహిత్ (Nara Rohith). ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'బాణం' అనే సినిమాతో ఇండస్ట్రీపై గురిపెట్టారు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అనే సినిమాల్లో నటించారు.

Tollywood Actor Nara Rohit may get engaged with Prathinidhi 2 heroin Siri Lella on October 13th

ఇలా పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. మొత్తానికి ఓ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీసే హీరోల్లో ఒకడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 తరువాత దాదాపు ఆరు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు రోహిత్. ఈ ఏడాది 'ప్రతినిధి 2' అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.

ఇక నారా రోహిత్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. నారా వారి అబ్బాయి నారా రోహిత్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి.. మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నెట్టింట్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ నెల 13న నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుంది. ఆ పెళ్లి కూతురు ఎవరనేది కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

Tollywood Actor Nara Rohit may get engaged with Prathinidhi 2 heroin Siri Lella on October 13th

ఇటీవల ప్రతినిధి -2 సినిమాలో నారా రోహిత్ సరసన నటించిన హీరోయిన్ సిరి లేళ్లను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగనున్నట్టు సమాచారం. అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌ కు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారని సమాచారం. అయితే నారా రోహిత్ నిశ్చితార్థం, పెళ్లి గురించి హీరో నుంచి కానీ అతని కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇంత లేటుగా ఓ ఇంటివాడు కాబోతున్నందుకు నారా రోహిత్ కు కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు మూవీ లవర్స్, ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: nara rohith
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X