ఆ దర్శకుడు తెలియకుండా ATM కార్డ్ తీసుకునేవాడు.. సూట్ కేసులు కూడా మోసా: హీరో నిఖీల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది సమ్మర్ లో పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి. పెళ్ళంటే పారిపోయే హీరోలు కూడా మొత్తానికి వారికి నచ్చిన అమ్మయిలను వెతుక్కొని పెళ్లి చేసేసుకున్నారు. ఇక అందరి కంటే ముందుగా కోవిడ్ రోజుల్లో నిఖిల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తరువాత నిఖీల్ మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

పెళ్లికి రూ.25వేల ఖర్చు..?
అలీతో సరదాగా షోలో నిఖీల్ సిద్దార్థ్ తన పెళ్లి ముచ్చట్లతో పాటు అనేక రకాల పర్సనల్ విషయాలని కూడా చెప్పాడు. నెక్స్ట్ వీక్ ప్రసారం కానున్న ఆ షో ప్రోమోని ఇటీవల రిలీజ్ చేశారు. ఇక పెళ్లికి ఎలా ఎంజాయ్ చేశావ్ ఒక పాతికి వేలు అయినా ఖర్చయ్యాయా అని అలీ వేసిన పంచ్ కి నిఖిల్ తల కిందకు వేసుకొని నవ్వేశాడు.

పుట్టబోయే పాప పేరు మాయ
పెళ్లి జరిగి కొన్ని నెలలే అవుతుంది అప్పుడే పాప పేరు పెట్టేశారట ఏంటి సంగతి ఏమైనా గుడ్ న్యూస్ చెప్పేస్తారా అని అలీ అడిగిన ప్రశ్నకు నికిల్ మాట్లాడుతూ.. నాకు పుట్టబోయే పాప పేరు మాయ అని మనసులో ముందే అనుకున్నాను. నా భార్యతో పెళ్లికి ముందు పరిచయమైమ కొన్ని రోజుల్లోనే ఈ విషయాన్ని చెప్పాను. తనకు కూడా బాగా నచ్చింది అని నిఖిల్ వివరణ ఇచ్చారు.

ఆ దర్శకుడు నా ATM తీసుకొని..
ఇక దర్శకుడు(కార్తికేయ) చందు మొండెటి గురించి మాట్లాడుతూ.. ఈ విషయం నేను బయటపెడితే చందు కొట్టేస్తాడేమో. నా మొబైల్ కి అప్పుడప్పుడు షాపింగ్ చేసిన మెస్సేజ్ వస్తుండేది. రెండు వేలు, మూడు వేలు కట్ అయ్యాయని మెస్సేజ్సెస్ చూసి షాక్ అయ్యేవాన్ని. వెంటనే చందుకి ఫోన్ చేస్తే.. నా దగ్గరే నీ ATM కార్డ్ భద్రంగా ఉందంటూ చెబుతాడాని నిఖీల్ సరదాగా వివరణ ఇచ్చారు.

ఆఖరికి సూట్ కేసులు కూడా మోసాను
ఇక హీరోగా అవ్వడం కోసమే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యానని చెప్పిన నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ సినిమా అప్పుడు ఆఖరికి సూట్ కేసులు కూడా మోసానని చెప్పాడు. ఇక తనతో ఎవరైనా స్నేహం చేస్తే అత ఈజిగా వదులుకోనని చెబుతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పుడు అలా గ్యాంగ్ ఉండేది, అందులో ఎవడు ముందు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా నన్నే హీరోగా పెట్టాలని, నేను హీరో అయితే వారికి మొదటి అవకాశం ఇస్తానని ఒక డీల్ సెట్ చేసుకునే వాడిని అంటూ నిఖిల్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











