హీరో శ్రీకాంత్ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
హీరో శ్రీకాంత్... తెలుగులో పరిచయం అక్కర్లేని పేరు. 1991లో పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమా ద్వారా నట జీవితం ప్రారంభించిన శ్రీకాంత్ ఇప్పటి వరకు దాదాపు 125కుపైగా సినిమాల్లో నటించారు. విలన్ పాత్రలు, హీరో పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడంతో విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉండే శ్రీకాంత్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుడిగా పని చేశారు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు. వీరి పిల్లలు కూడా నటులుగా తమ కెరీర్ మొదలు పెట్టారు.

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన శ్రీకాంత్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించడంలో, తన ప్రతిభతో వరుస అవకాశాలు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ తన మొదటి సినిమాను గుర్తు చేసుకున్నారు.
ఉషాకిరణ్ మూవీస్ వారి 'పీపుల్స్ ఎన్ కౌంటర్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యాను. ఈ సినిమాలో నక్సలైట్ నాయకుడిగా నటించాను. ఇందులో నటించినందుకు అందుకున్న తొలి పారితోషికం రూ. 5 వేలు. ఆ సినిమాలో చెప్పిన డైలాగ్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











