బాలకృష్ణ ఒక ఎన్‌సైక్లో పీడియా : సుమంత్ కామెంట్
టాలీవుడ్ హీరో సుమంత్ త్వరలో 'సుబ్రహ్మణ్యపురం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సంక్రాంతికి విడుదల కాబోతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో సుమంత్ తన తాత ఏఎన్ఆర్ పాత్రలో కనిపించబోతున్నారు.
సుమంత్ తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతూ...' ఎన్టీఆర్ బయోపిక్‌లో స్వయంగా మా తాతగారి పాత్రలో నటించడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఆ పాత్ర పోషించడం నా బాధ్యగా భావిస్తున్నాను' అన్నారు. మా కుటుంబ సభ్యులంతా నన్ను తాతగారికి దగ్గరి పోలికలతో ఉంటావని చెబుతుంటారని తెలిపారు.

బాలకృష్ణ లాంటి గొప్ప నటుడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా. ఇప్పటి వరకు కెరీర్లో చేసిన చిత్రాల్లోని డైలాగులన్నీ కూడా ఆయనకు గుర్తుంటాయి. అలాంటి స్టార్‌తో కలిసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
సుమంత్ మూవీ 'సుబ్రహ్మణ్యపురం' విశేషాల్లోకి వెళితే డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.
'సుబ్రహ్మణ్యపురం'లో దేవుడిని అస్సలు నమ్మని పాత్రలో నటిస్తున్న సుమంత్... నిజ జీవితంలో మాత్రం తాను దేవుడిని నమ్ముతానని, గుడి, మసీద్, చర్చికి వెళుతుంటానని చెప్పుకొచ్చారు. థ్రిల్లర్ సినిమాలు చేయడం నచ్చక పోయినా దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఒప్పుకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











