Kiran Abbavaram: ఘనంగా కిరణ్ అబ్బవరం రహస్యల ఎంగేజ్‌మెంట్.. ఈ వీడియో చూశారా?
కొత్త ఏడాది వచ్చినప్పటి నుంచి కుర్ర హీరోహీరోయిన్లు అంతా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. తమ ప్రేమ విషయాలను బయట పెడుతూ.. తమకు నచ్చిన వాళ్ల మెడలో మూడు ముళ్లు వేసేస్తున్నారు. గతేడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి కాగా.. ఇటీవలే రకుల్ ప్రీత్ కూడా పెళ్లి చేసుకుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ముఖ్యంగా తన ప్రేయసి రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
కిరణ్ తో పాటు రహస్యకు కూడా రాజా వారు రాణివారు తొలి చిత్రమే. ఈ చిత్రం సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు మూడ్రోజుల క్రితమే ప్రకటించింది. కిరణ్ అబ్బవరమే నేరుగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ చాలానే వార్తలు రాగా ఏ ఒక్కరూ స్పందించలేదు.

కానీ తాజాగా వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం.. అందులోనే నిశ్చితార్థం ఎప్పుడో కూడా చెప్పడంతో అంతా సర్ ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా రాజా వారు రాణివారు సినిమాలో హీరోహీరోయిన్లుగా చేసిన వీరు ప్రేమలో పడడం.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతుండడంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా ఈరోజు వీరిద్దరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా జరిగిది.
బేబీ పింక్ కలర్ కుర్తాలో కిరణ్ అబ్బవరం చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఇక రహస్య అయితే లైట్ గ్రీన్ కలర్ చీరలో మరింత ముద్దుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన వీరి ఎంగేజ్ మెంట్ వీడియోలో కిరణ్ అబ్బవరం తన ప్రేయసికి ఉంగరం తొడుగుతూ కనిపించాడు. ముందుగా హీరోయిన్ ఉంగరం తొడగ్గా.. ఆ తర్వాత కిరణ్ ఆమెకు పెట్టబోయే రింగ్ ను ముద్దు పెట్టుకున్నాడు. దేవుడిని ప్రార్థించుకుని మరీ తనకు కాబోయే భార్య చేతికి తొడిగాడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఉంగరాలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ మురిసిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ జంట పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. కానీ త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మీరు కూడా ఓసారి ఈ క్యూట్ కపుల్ ఎంగేజ్ మెంట్ వీడియో చూసేయండి.


Click it and Unblock the Notifications











