Kiran Abbavaram సీక్రెట్‌గా కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్.. రహస్యంగా హీరోయిన్‌తో పెళ్లి!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరు తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్, ఆ తర్వాత ఆశిష్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వరుసగా వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లికి రెడీ అయిపోయాడు. అది కూడా తన సీక్రెట్ లవర్ తోనే. గత కొంత కాలంగా వారిపై రూమర్స్ వస్తునే ఉన్నా.. అలాంటిది ఏమి లేదని చెప్తూనే.. సడెన్ గా పెళ్లికి రెడీ అయిపోయాడు కిరణ్ అబ్బవరం. అసలు ఆ హీరోయిన్ ఎవరు.. వీరి ప్రేమ కథ ఏంటి.. పెళ్లి, నిశ్చితార్థం ఎప్పుడు అనేది ఈ స్టోరీలో చూసేద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యిందనే విషయం తెలిసిందే. వరుసగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. వివాహం బంధంలోకి అడుగుపెడుతున్నారు. మొన్న ఆశిష్ రెడ్డి పెళ్లికి రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం కూడా పెళ్లికి రెడీ అయిపోయాడు. తన సీక్రెట్ లవర్ తో పెళ్లికి రెడి అయిపోయినట్లు బహిరంగంగా ప్రకటించేశాడు.

కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజా వారు రాణివారు అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఫలితం ఆశించకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఆయన ఫ్యాన్స్ కు మాత్రం ఆ బాడీకి సరైనా హిట్ పడితే బాగుంటుందని కామెంట్స్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. సడెన్ గా కిరణ్ అబ్బవరం పెళ్లికి సిద్ధం అయిపోయాడు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తన మొదటి సినిమా రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా తనతో కలిసి నటించిన రహస్య గోరఖ్ నే కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్ లో ఉంటున్నారనే వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే వీటిపై ఇద్దరు బహిరంగంగా ప్రకటించలేదు కానీ సడెన్ గా పెళ్లికి సిద్ధం అయినట్లు చెప్పుకువచ్చారు.
ఇక వీరి ఎంగేజ్మెంట్ ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో జరగనుంది. కిరణ్ అబ్బవరం మామూలుగా తన జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకుంటారు. తన వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ కానివ్వరనే విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుందట. ఇక ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం టీమ్ క్లారిటీ ఇవ్వనుంది.

అయితే వీరి ఎంగేజ్మెంట్ మాత్రం మార్చి 13న పెద్దల సమక్షంలో జరగనుందట. ఆ తర్వాత పెళ్లి తేదీ ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం "దిల్ రూబా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీనితో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం టీమ్ వెల్లడించనుంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం "దిల్ రూబా" సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.


Click it and Unblock the Notifications











