Hero Srikanth: మొన్నేమో విడాకులు, ఇప్పుడు రేవ్ పార్టీ.. వాడచ్చం నాలా ఉండడం వల్లే సమస్య!
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు, రేవ్ పార్టీలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అనేక మంది సెలబ్రిటీలు ఈ కేసుల్లో ఇరుక్కుంటూ తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి పార్టీల్లో నిషేదిత ఉత్ప్రేరకాలను వాడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. అలా పరువు పోగొట్టుకుని.. తరచుగా పోలీస్ స్టేషన్లు, కర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాజాగా బెంగళూరు నగర సమీపంలో రేవ్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోల్లో హీరో శ్రీకాంత్ కనిపించారు. అయితే తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో సోమవారం రోజు రాత్రి ఉదయం 3 గంటలకు రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకలను జరిపినట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి పేరిట ఆ ఫామ్ హౌస్ ఉండగా అక్కడే వేడుకలు జరిగాయి. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.ఈక్రమంలోనే 100 మందికి పైగా పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో పాతిక మందికి పైగా సినీ నటులు, అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్, దొరకగా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.

ముఖ్యంగా ఘటనా స్థలిలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్ తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా టీవీ ఛానెల్స్ తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో హీరో శ్రీకాంత్ కూడా కనిపించారు. దీంతో అందరూ ఆయన కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారని చెప్పుకొస్తూ వార్తలు రాశారు. అయితే ఈ వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందించారు. ముఖ్యంగా తాను ఎక్కడికీ వెళ్లలేదని వివరించారు.
తాను అసలు బెంగళూరుకే వెళ్లలేదని.. ఇంట్లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తనపై ఇప్పటి వరకు అనేక వార్తలు వచ్చాయని స్పష్టం చేశారు. మొన్నోమో తాను విడాకులు తీసుకున్నట్లు, ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్లినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. నేను అలాంటి వాడిని కాదంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చాలా మంది తనకు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నారని.. అయితే ఆ వీడియోల్లో ఉన్నది తాను కాదని తెలిపారు.
ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరో కానీ అచ్చం తనలాగే కనిపించడం వల్లే ఈ సమస్య వచ్చిందని.. కానీ ఈ వార్తలన్నీ చూసి తనకు చాలా నవ్వు వచ్చిందని.. ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ చాలా నవ్వుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా తనపై తప్పుడు వార్తలు రాయొద్దని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన ఈ కామెంట్ల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











