Ram Charan: రామ్ చరణ్ విగ్రహ ప్రతిష్ఠ.. గ్లోబల్ స్టార్ కు అరుదైన గౌరవం
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమా నుండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శ్రమించాడు. తనదైన నటన, డ్యాన్సులు, యాక్షన్ మూమెంట్స్ మెగా పవర్ స్టార్ గా ఓస్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మగధీర తో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు వచ్చే.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏంటీ?
మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగు రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ అందించారు. ఇక మగధీర, రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ సినిమాలలో చెర్రీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. తన నటనతో సినిమా ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Global Star Ram Charan Statue at World Famous Madame Tussauds London 🤯🤯🥵@AlwaysRamCharan #GameChanger pic.twitter.com/eRCFg15o1b
— RC Addict 🚁 (@Its_Chanakya) September 29, 2024
అయితే రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ విగ్రహా ఆవిష్కరణ ఉండబోతుందని తెలుస్తోంది. రామ్ చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ చూసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు ఈ మైనపు బొమ్మను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











