"సిగ్గులేకుండా గర్ల్ ఫ్రెండ్‌ను అలా అడిగేవాడిని.. థియేటర్‌లోనే కిస్ చేశా.. కుర్రహీరో షాక్"

కలర్ ఫొటో ఫేమ్ హీరో సుహాస్ గురించి, ఆయన టాలెంట్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ అందరి చేత ఆహా అనిపిస్తున్న ఈ కుర్ర హీరో తొలిసారి తన ప్రేమ కథ గురించి చెప్పారు. ముఖ్యంగా తన ప్రియురాలితో చేసిన చిలిపి పనులు గురించి కూడా వివరించారు. అలాగే తన కెరియర్ ఎలా మలుపు తిరిగిందో కూడా వివరించారు. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తొలిసారి కలర్ ఫొటో సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తొలిసినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. నెక్స్ట్ సినిమాను కూడా చాలా కసిగా చేశాడు. ముఖ్యంగా రైటర్ పద్మభూషణ్ పేరుతో వచ్చి తల్లిప్రేమను వివరించాడు. ఇలా రెండో సినిమాతోనూ హిట్ కొట్టిన ఈయన.. ఆ తర్వాత మను చరిత్ర, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలతోనూ అందరినీ మాయ చేశాడు. ఇలా స్పెషల్ స్టోరీస్ తో వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈయన తాజాగా ఓ ఇటంర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు.

Tollywood Hero Suhas Shocking Comments About His Girl Friend Check Details

ముఖ్యంగా తన ప్రేమ కథ, సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో కూడా సుహాస్ చెప్పుకొచ్చాడు. తాను డిగ్రీలో ఉండగానే.. ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చాడు. తనతో మాట్లాడడానికి, కలవడానికి చాలానే తంటాలు పడేవాడినని అన్నాడు. ముఖ్యంగా అమ్మాయి గురించి తన ఇంట్లో ముందే తెలియడంతో... ఆమె తరచుగా తన ఇంటికి వచ్చేదని కూడా వివరించారు. డిగ్రీలో ఉండగానే థియేటర్లో తనను ముద్దు పెట్టినట్లు కూడా వెల్లడించాడు. అంతే కాకుండా డిగ్రీ తర్వాత సినిమాల్లోకి వచ్చేందుకు చాలానే ప్రయత్నాలు చేసినట్లు వివరించాడు.

అయితే డిగ్రీ తర్వాత ఇంట్లో డబ్బులు తీసుకోవడం ఇష్టం లేని తాను.. తన ప్రియురాలి వద్ద మాత్రం ఈజీగా డబ్బులు అడిగి తీసుకునే వాడినని సుహాస్ చెప్పాడు. తనను అడగడానికి ఏమాత్రం సిగ్గు పడే వాడిని కాదని.. అలాగే మరికొందరు తనకు ఎప్పుడూ సాయం చేసే వాళ్లని వివరించారు. వాళ్లందరూ చేసిన సాయం వల్లే తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని.. ప్రస్తుతం తన ప్రియురాలినే పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

Tollywood Hero Suhas Shocking Comments About His Girl Friend Check Details

ఇప్పుడు తాను సంపాధించిన మొత్తాన్ని తీసుకెళ్లి భార్యకే ఇస్తానని.. అందులోంచి రోజూ కొంచెం అడిగి తీసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చాడు. తన చేతిలో ఉంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుందని.. అదే తన భార్య లలిత చేతిలో ఉంటే సేవ్ చేస్తుందని స్పష్టం చేశాడు. తాను ఎన్ని సినిమాలు చేసి ఎంత ఫేమ్ వచ్చినా పొగరు పెరగదని.. హీరోను అన్న గర్వం మాత్రం లేదని చెప్పాడు. ఎప్పుడూ పని త్వరగా అయిపోయేలా చేసుకోవాలని చూస్తానని.. తన గురించి పూర్తిగా వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X