అర్దనగ్నంగా సుశాంత్.. వెరైటీ ఫోటో షూట్ వైరల్

సుశాంత్ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా పోస్టర్లు, టీజర్ బాగానే క్లిక్ అయ్యాయి. మూవీ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా సుశాంత్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. అయితే చిలసౌ సినిమా హిట్ అయిన తరువాత సోలో హీరోగా మళ్లీ హిట్ కొట్టలేకపోయాడు. మధ్యలో అల వైకుంఠపురములో సినిమాతో మంచి క్యారెక్టర్ పట్టేశాడు. ఆ సినిమాతో సక్సెస్ కొట్టి నటుడిగా మంచి గుర్తింపు కొట్టేశాడు.

కానీ సోలో హీరోగా మరో సినిమాను త్వరగా పట్టాలెక్కించలేకపోయాడు. అయితే ఆలస్యంగా వస్తోన్నా కూడా సుశాంత్ మాత్రం హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఈ సినిమా కోసం మొత్తం లుక్‌ చేంజ్ చేసేశాడు. శరీరాకృతిని కూడా మార్చేసుకున్నాడు. అయితే సినిమాల ద్వారా పలకరించకపోయినా కూడా యాడ్స్ ద్వారా సుశాంత్ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు మరో వెరైటీ ఫోటో షూట్‌తో ముందుకు వచ్చాడు.

 Tollywood hero Sushanth Latest Photoshoot goes viral

షర్ట్ లెస్‌గా అర్దనగ్నంతో సుశాంత్ దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో టీజర్‌ను లాంచ్ చేయించి బాగానే ప్రమోట్ చేశారు. హేయ్ మనసుకెందుకిలా అంటూ వదలిని సాంగ్ కూడా సోషల్ మీడియాలో బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు ఇది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా సమ్మర్ కానుకగా రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X