సుశాంత్ షాకింగ్ లుక్.. కొత్త సినిమా కోసమేనా?
అక్కినేని వారసుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు హీరో సుశాంత్. మొదటి చిత్రం కాళిదాసుతోనే మంచి విజయం అందుకున్నాడు. ఆపై కరెంట్ వంటి మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయితే కమర్షియల్ హీరోగా ముద్ర వేయించుకోవాలన్న తపనతో మధ్యలో చేసిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. చిలసౌ వంటి కథా ప్రాముఖ్యమున్న చిత్రంతో సుశాంత్‌కు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.
చిలసౌ సినిమాతో సుశాంత్ ఒక్కసారిగా అందరి నోళ్లలో నానాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి స్లోపాయిజన్‌లా ఎక్కేసింది. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో సుశాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే అల వైకుంఠపురములో చిత్రంలో ముఖ్య పాత్రను పోషించాడు. అయితే సుశాంత్‌కు తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కినా కూడా కనిపించినంతలో చక్కగా నటించి మెప్పించాడు.

లుక్స్ పరంగానూ అల వైకుంఠపురములో కొత్తగా కనిపిస్తాడు సుశాంత్. తన తదుపరి ప్రాజెక్ట్ ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రం కోసం మరింత స్టైలీష్‌గా రెడీ అవ్వబోతోన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ బాగానే వైరల్ అయ్యాయి. ఈ కరోనా, లాక్ డౌన్ వంటివి రాకపోతే ఈపాటికి సినిమాతో ప్రేక్షకులను పలకరించేవాడు. అయితే ఈ లాక్ డౌన్ కాలంలో సుశాంంత్ తన లుక్కును పూర్తిగా మార్చేశాడు. ఓ పిలక పెట్టుకుని, మగధీర, బద్రీనాథ్ రెండింటిని కలిపితే వచ్చే హెయిర్ స్టైల్‌లో దర్శనమిచ్చి అందర్నీ షాక్ చేశాడు. ప్రస్తుతం సుశాంత్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











