twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజాస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు: రెండుసార్లు మోసపోయిన బన్నీ.. ఎన్టీఆర్ కూడా

    |

    ఒక సినిమా కథ విన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అగ్ర హీరోలు ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కూడా కమిట్మెంట్స్ వలన చేయాల్సి వస్తుంది. అలాంటి సినిమాలు చాలా వరకు నిరాశపరుస్తాయి. ఇక ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఉన్నటువంటి సినిమాలను కొంతమంది కథలు విన్నప్పుడే రిజెక్ట్ చేసి మంచి పని చేశారు. మరికొందరు వాటిని ఓకే చేసి దెబ్బతిన్నారు. అలాంటి సినిమాలపై ఒక లుక్కేస్తే..

    ప్రభాస్ రిజెక్ట్ చేస్తే..

    ప్రభాస్ రిజెక్ట్ చేస్తే..

    వివి.వినాయక్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా బద్రీనాథ్. విడుదలకు ముందు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కథను అంతకుముందు ప్రభాస్ కూడా విన్నాడు. కథలో రిస్క్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయని వద్దనుకున్నాడు. ఇక ఆ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్తగా దర్శనమిచ్చినప్పటికి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు.

    బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమా

    బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమా

    రైడ్ సినిమాటగో మంచి క్రేజ్ అందుకున్న రమేష్ వర్మ రెండవ సినిమాతో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అదే వీర మూవీ. రవితేజ హీరోగా వచ్చిన ఆ సినిమా కథను అంతకుముందు బాలకృష్ణకు కూడా చెప్పడం జరిగింది. అయితే బాలయ్య మాత్రం ఆ కథను ఓకే చేయలేదు

    రామ్ విన్న కథలో జూనియర్ ఎన్టీఆర్

    రామ్ విన్న కథలో జూనియర్ ఎన్టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాల్లో రభస ఒకటి. కందిరీగ హిట్టుతో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ వెనువెంటనే రామ్ కు మరో కథబు వినిపించాడు. అదే రభస స్టోరీ. అయితే రామ్ ఆ కథకు ఒప్పుకోలేదు. ఇక తారక్ రిస్క్ అని తెలిసి ఆ సినిమాను పూర్తి చేసి దెబ్బతిన్నారు.

    అనగనగా ఒక ధీరుడు.. వాళ్ళు వద్దంటే

    అనగనగా ఒక ధీరుడు.. వాళ్ళు వద్దంటే

    మొదటిసారి హాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ సిడ్నీ వరల్డ్ సినిమాలో అనగనగా అనే తెలుగు సినిమాను రూపొందించారు. సిద్దార్ట్ ఒకే చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. అయితే అంతకుముందుఈ కథను రామ్ చరణ్, ప్రభాస్ రిజెక్ట్ చేశారట. ఈ సినిమాను కె.రాఘవేంద్రరా తనయుడు ప్రకాష్ డైరెక్ట్ చేశారు

    అలా తప్పుకున్న ఎన్టీఆర్

    అలా తప్పుకున్న ఎన్టీఆర్

    అల్లు అర్జున్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమా కూడా హిట్ అవుతుందని మొదట్లో టాక్ బాగానే వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు అందుకోలేకపోయింది. ఇక ఆ సినిమాను ముందే ఎన్టీఆర్ రిజెక్ట్ చేసి ప్లాప్ నుంచి తప్పుకున్నాడు.

    English summary
    Top heroes think a lot to give the green signal when they hear a movie story. Sometimes it has to be done because of commitments even if you don’t like it. Such movies are very frustrating. And some of the films that were in the Biggest Disaster in the industry did a good job of being rejected when they heard the stories.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X