Meenakshi Chaudhary: మల్లెపూలు, తెల్లచీరలో అందాల మీనాక్షి.. ఈ చేప కనుల క్యూటీని సూటిగా చూస్తే అంతే!
హరియాణాలో పుట్టి పెరిగిన హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. మాడల్ గా కెరియర్ ప్రారంభంచిన ఈమె తన అందాలతో సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ క్యూట్ బ్యూటీ తాజాగా నెట్టింట అదిరిపోయే గ్లామర్ షో చేసింది. మల్లెపూలు పెట్టుకుని.. తెల్ల చీర కట్టుకుని తెగ సోకులు పోయింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీనాక్షి చౌదరి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా హిట్ ది సెకండ్ కేసు సినిమాలో అడవి శేష్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి మెప్పించిందీ క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత ఖిలాడీ, హిట్, తమిళ్ లో కొలై చిత్రాల్లో నటించింది.

కేవలం సినిమాలు, ర్యాంప్ వాక్ ల ద్వారానే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను షేర్ చేస్తుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందాలను ఆరబోస్తుంటుంది. విపరీతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. అందులో తెల్ల చీర కట్టుకుని.. మల్లెపూలు పెట్టుకుని మెస్మరైజింగ్ షో చేసింది.

వైట్ జారే చీరకు.. ఎల్లో కలర్ డిజైనర్ బ్లౌజు వేసుకున్న ఈమె.. పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుంది. అలాగే చక్కగా జడ వేసుకుని మల్లెపూలు పెట్టుకుంది. వాటిని ముందుకు వేసుకుని తన అందాలను మరింత హైలెట్ చేసింది. ఎక్కడో వెకేషన్ కు వెళ్లిన ఈమె.. ప్రకృతి మధ్యన నిలబడి భలే ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. సన్నజాజి పూవులాంటి సొంపులు కల్గిన ఈమె సోకులకు నెటిజెన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఏంటమ్మా క్యూట్ బ్యూటీ.. చీరలో హాట్ హాట్ అందాలన్నీ ఆరబోస్తున్నావంటూ తమ మనసులోని భావాలను కామంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. నిన్న చూస్తే తట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు. మరికొందరేమో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ హాటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి అందాలకే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆమె గ్లామరస్ ఫొటోలు చూడడానికే ఎక్కువ మంది ఆమెను ఫాలో చేస్తున్నారు. ఆమె పెట్టే ప్రతీ పోస్టుకు లైకులు, షేర్లు, కామెంంట్లతో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా గ్లామరస్ ఫొటోలు అయితే తెగ వైరల్ అవుతుంటాయి.


Click it and Unblock the Notifications











