సూపర్ స్టార్ కృష్ణ ఆ విషయంలో ఫెయిల్యూర్.. కానీ మహేష్ బాబు సూపర్ సక్సెస్ అట!
Mahesh Babu: టాలీవుడ్ లో ఇప్పుడున్న బడా హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే అరుదు. ఒకవేళ వారు చేసిన ఆ సినిమా ఫ్లాప్ అయిందో.. ఇక రెండు, మూడేండ్లు ఇండస్ట్రీకి దూరం. కానీ, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. హిట్స్, ప్లాప్స్ లతో సంబంధం లేకుండా.. రోజులు రెండు లేదా మూడు షెడ్యూల్స్ ల్లో షూటింగ్స్ చేస్తూ.. ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించేవారు ఆనాటి స్టార్ హీరోస్.
అందులో సూపర్ స్టార్ కృష్ణనే టాప్. ఆయన ఒక్కోసారి మూడు, నాలుగు షిప్టుల్లో కూడా నటించే వారంట. కొన్ని సందర్భంలో ఆయన నైట్ పడుకునే సమయంలో కూడా ఆయనను షూట్ చేసే వారంట. తెలుగు చిత్రసీమలో ఏ నటుడు నటించని విధంగా 1972లో ఏకంగా 18 సినిమాల్లో నటించి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. అందులో మా ఊరి మొనగాళ్లు, రాజ్ మహల్, హంతకులు దేవాంతకులు, పండంటి కాపురం, కత్తుల రత్తయ్య, ఇల్లు ఇల్లాలు వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్. అలాగే.. 1970లో 16 సినిమాలు, 1973లో 15 సినిమాల్లో నటించి తన అభిమానులకు వినోదాన్ని పంచారు.

ఇలా సూపర్ స్టార్ కృష్ణ చాలా సంవత్సరాలు రాత్రిపగలు తెలియకుండా షూటింగ్స్ చేసారు. సరైన తిండి, నిద్ర కూడా ఉండేది కాదంట. కొన్ని సందర్భంలో లోకేషన్స్ ల్లో పడుకునే వారంట. ఆయన తన ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి తనను తాను అప్డేట్ చేసుకుంటూ.. ఇండస్ట్రీలో కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈ సమయంలో ఆయన తన ఫ్యామిలీతో సరదగా గడిపే ఉండేది కాదు. ఆయన భార్య ఇందిర .. ఆమెనే పిల్లల బాగోగులన్నింటిని దగ్గర ఉండి చూసేవారంట.
ఇది ఉంటే.. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు మహేశ్ బాబు. ఆయన తన తండ్రి కృష్ణ నడిచిన బాటలో నడవడకుండా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన చాలా సింపుల్స్ సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తూ.. కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజంగా టాలీవుడ్ లో ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరో ఎవరంటే.. ముందుగా గుర్తుకు వచ్చే నటుడు మహేష్ బాబు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మహేష్‌కు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. లాగేజ్ సర్దేసి.. ఫ్యామిలీతో సహా వెకేషన్‌కు వెళుతుంటారు. ముఖ్యంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలను సందర్శిస్తుంటారు. కనీసం ఆరు నెలలకొనసారైనా.. నమ్రతతో పాటు పిల్లలు సితార, గౌతమ్ అందరూ కలిసి ఫారెన్ టూర్స్ వేస్తుంటారు మహేష్ బాబు.
తన తండ్రి కృష్ణ గారితో తన చిన్నతనంలో ఎక్కువ సేపు గడపలేకపోయినా మహేష్ బాబు.. తాను తన తండ్రి నడిచిన బాటలో నడకుండా.. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు తన భార్య పిల్లలతో చాలా సేపు గడుపుతారు. అలాగే.. ఆయన సంవత్సరానికి కేవలం సినిమానే చేస్తూ.. అటు ఫ్యాన్స్ కు.. ఇటు ఫ్యామిలీని ఇంపార్టెస్స్ ఇస్తురనేది టాలీవుడ్ లో టాక్.


Click it and Unblock the Notifications











