Dil Raju: ఆ ఇద్దరు హీరోలు నాకు కుడి, ఎడమ భుజాలు.. అమెరికాలో దిల్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్!
ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారటంతో ఏవేవో జరిగిపోతాయని, పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయని చాలామంది ఆశలు పెట్టుకుంటున్నారు. అందులో సినిమా వాళ్లు కూడా ఉండటం విశేషం. గత ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే.
సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలేవి ఒకటి రెండు రోజుల్లో భారీ వసూలు రాబట్టుకునే విధానానికి చెక్ పెట్టింది. గత ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కూడా జగన్ ప్రభుత్వం కళ్లెం వేసింది, కేవలం నాలుగు షోలకు మాత్రమే అనుమతినిచ్చింది దీనికి తోడు సినిమా టికెట్ల ధరల విషయంలో స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

మున్సిపాలిటీలకు, పంచాయితీలకు, కార్పొరేషన్లకు వేరువేరు ధరలను నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయంపై సినీ ప్రముఖులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికి పెద్దగా చలించలేదు నాటి ప్రభుత్వం. అయితే ప్రభుత్వం మారేసరికి మళ్ళీ టాలీవుడ్ కి పూర్వవైభవం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఈసారి ఎలక్షన్స్ లో నెగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గత మూడుసార్లు నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకి తోడయ్యారు.
భారీ మెజారిటీతో ఎలక్షన్స్ లో నెగ్గి చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా టాలీవుడ్ తరఫునుంచి పవన్ బాలయ్య లాంటివారు కుడి ఎడమలు గా ఇప్పుడు రూలింగ్ ప్రభుత్వంలో ఉన్నారు.

ఇక ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదు అని తెలిపారు. ఇప్పుడు ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఇలాంటి ఆశాభావంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరి సమస్యలు ఏమాత్రం తీరుస్తారో, సినీ ఇండస్ట్రీకి వారి వంతు సహాయం ఏ మాత్రం అందిస్తారో భవిష్యత్తులో తెలియాల్సిందే.


Click it and Unblock the Notifications











