ఎన్టీఆర్‌కు దిల్‌రాజ్ కొడుకు నమస్కారం.. చిన్నారి సంస్కారానికి తారక్ ఎమోషనల్
కొందరు చిన్నారులు తమ వయసుకు మించిన పనులతో పెద్దలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. కొందరు మంచి పనులు చేస్తే, ఇంకొందరు అల్లరి పనులతో విసుగు తెప్పిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొడుకు అన్వయ్ రెడ్డి చిన్న వయసులోనే తన సంస్కారాన్ని బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే :
తెలుగు చిత్ర పరిశ్రమను కనుసైగతో శాసించగల కొందరిలో దిల్‌రాజు కూడా ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా దిల్‌రాజు ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన.. తన మొదటి సినిమానే ఇంటి పేరుగా పెట్టుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాల వరకు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దిల్‌రాజు సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఉంటుందని నమ్మి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80 శాతం సక్సెస్ రేటు ఉదంటే దిల్‌రాజు జడ్జిమెంట్‌ను అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో కలిసి రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఆయన పేరు సౌత్‌లో మారుమోగిపోతోంది. త్వరలోనే గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. దిల్‌రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, కుమార్తె హర్షిత రెడ్డి ఒత్తిడి మేరకు 2020 లాక్‌డౌన్ సమయంలో తేజస్వినీ అనే అమ్మాయిని దిల్‌రాజ్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. భార్యాబిడ్డలతో దిల్‌రాజు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొడుకుని అల్లారుముద్ధుగా చూసుకుంటున్నాడు దిల్‌రాజ్.
కాగా.. తన రీసెంట్ మూవీ జనక అయితే గనక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ రిలీజ్ రోజున అభిమానులు నానా హంగామా చేస్తారని.. కానీ రెండో రోజు ఆ హడావుడి కనిపించదని ఆయన వ్యాఖ్యానించారు. తన సినిమా నచ్చితే బలగం తరహాలో ఆదరించాలని , మా సినిమా ఖచ్చితంగా 70 శాతం మందికి నచ్చుతుందని దిల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ బండ్ల డైరెక్ట్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇదిలాఉండగా.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ , జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ నటించిన చిత్రం దేవర. వారం రోజుల్లోనే దేవర బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ వేదిక వద్దకు వస్తుండగా.. దిల్‌రాజు రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఆయన కొడుకు అన్వయ్ రెడ్డి కూడా ఉండటంతో చిన్నారిని తారక్ ముద్దుచేశారు. ఈ సమయంలో బాబు తన చిట్టి చేతులతో ఎన్టీఆర్‌కు నమస్కారం చేయగా.. తారక్ షాకై తాను కూడా ప్రతి నమస్కారం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దిల్‌రాజు కొడుకు సంస్కారాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











