‘ఇండస్ట్రీలో వాటికి దూరంగా ఉన్నా.. అందుకే సక్సెసయ్యా’

టాలీవుడ్ సీనియర్ హీరో మురళీ మోహన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అంతకు మించిన అభినయం కలగలిగిన ఈయన ఎన్నెన్నో సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. ముఖ్యంగా ఒక్క రీమార్క్ కూడా లేకుండా తన పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను కొనసాగించారు. అయితే ఆయనకు సక్సెస్ కారణం ఒకటేనని... సినిమాల్లో ఉన్నంత వరకు వాటికి దూరంగా ఉండడం వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి అయి బిజినెస్ మేన్ గా కొనసాగుతున్న మాగంటి రాజబాబు.. అందంగా ఉండగా అంతా సినిమాల్లోకి వెళ్తే బాగుటుందని చెప్పడంతో... సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ అప్పటికే తెలుగులో చాలా మంది రాజబాబులు ఉండగా.. ఆయన మురళీ మోహన్ అనే నామకరణం చేసి హీరోగా మార్చారో దిగ్గజ డైరెక్టర్. తొలి సినిమాలోనే ఆయన అందం, అభినయానికి అంతా ఫిదా అయి సూపర్ సక్సెస్ కాగా నెక్స్ట్ సినిమాల్లోనూ పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. ముందు రెండేళ్ల పాటు అటు బిజినెస్ తో పాటు ఇటు సినిమాలు చేసిన ఈయన ఆ తర్వాత పూర్తి హీరోగా మారిపోయాడు.

Tollywood Senior Actor Murali Mohan Comments About His Success Reason Check Details

కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేసి ఫుల్ బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్ల పాటు ఆయన సినిమాల్లో కొనసాగడానికి, తనపై ఒక్క రీమార్క్ కూడా రాకపోవడానికి ఓ కారణం ఉందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాను సినిమాల్లోకి వచ్చేముందే ఏం చేసినా అవి మాత్రం చేయకూడదని ఫిక్స్ అయ్యారట. అందులో ప్రధానంగా అమ్మాయిలు, అందం, జూదం, పేకాట, మద్యం వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకున్నారట. అలా ఉంటేనే తన జీవితం బాగుంటుందని భావించారట.

Tollywood Senior Actor Murali Mohan Comments About His Success Reason Check Details

అందుకే వీటన్నిటికీ దూరంగా ఉంటూ.. తన పని తాను చేసుకుని వెళ్లిపోయేవాడినని చెప్పారు. ముఖ్యంగా అమ్మాయిలకు, రూమర్లు, జూదం, మద్యానికి, డ్రగ్స్ కు చాలా దూరంగా ఉండడం వల్లే తన జీవితం బాగుందని.. అటు పర్సనల్ లైఫ్ తో పాటు ఇటు ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా బాగుపడిందని వివరించారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసు కల్గిన ఈయన అన్ని రకాలుగా మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పటి తరం కుర్రహీరోలు అంతా ఈయనను ఫాలో అయితే లైఫ్ లో కచ్చితంగా సక్సెస్ సాధిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X