సినీ పరిశ్రమకు ఎన్నో అవమానాలు.. పవన్ మనసులో అవి బలంగా.. అందుకే వైసీపీ పతనం.. నరేష్ సంచలన వ్యాఖ్యలు
దిగ్గజ నటి , దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఒకప్పుడు కామెడీ హీరోగా నవ్వించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తన అద్భుతమైన నటన, టైమింగ్‌తో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన వివాహ జీవితం, పవిత్ర లోకేష్‌తో సహజీవనం వంటి వివాదాలను పక్కనబెడితే నటుడిగా ఆయనకు నూటికి నూరు మార్కులు పడతాయి. నరేష్‌తో పాటు కెరీర్ ప్రారంభించిన వారు ఫేడవుటై , సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆయన మాత్రం ఫుల్ బిజీ.
సోషల్ మీడియాలో , మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నరేష్ తన వ్యక్తిగత, సినిమా సంగతులతో పాటు సమకాలీన అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. గతంలో బీజేపీలో పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో రాజకీయాలపై మంచి విశ్లేషణ చేయగలరు. ఈ క్రమంలో తోటి సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు నరేష్. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ.. పవన్ రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవి ఆశించి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లలేదని, ఏం లేనప్పుడే పీపుల్స్ ఆర్మీ అని పెట్టి కోట్ల రూపాయలను ప్రజల కోసం విరాళంగా ఇచ్చారని నరేష్ గుర్తుచేశారు.

పవన్ కళ్యాణ్‌లో కసి ఉందని , ఏదో చేయాలనే తపన ఉందన్నారు. ఎన్టీఆర్ తర్వాత దమ్ముండి, నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన ప్రశంసించారు. ఫెయిల్యూర్స్ ఎదురైనా తగ్గకుండా, పారిపోకుండా నిలబడి ముందుకు వెళ్లి, వారాహీతో జనాల్లోకి వెళ్లాడని.. పవన్ కళ్యాణ్‌ది మామూలు పోరాటం కాదన్నారు. సినీ పరిశ్రమకు గతంలో అవమానాలు జరిగాయని.. అవి అందరి మనసులను తొలిచేశాయని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ మనసును కూడా అవి కష్టపెట్టాయని.. సినీ ఇండస్ట్రీ నుంచి దీక్షతో వెళ్లిన వ్యక్తని, ఆయన ఇవాళ సక్సెస్ అవుతున్నాడని నరేష్ ప్రశంసించారు. ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేయాలని, ఎందుకంటే కమిట్‌మెంట్‌తో ఉన్నది పవన్ ఒక్కడేనని నరేష్ అన్నారు.

కాగా.. కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార సభల్లో సూపర్‌స్టార్ కృష్ణ ప్రస్తావన తీసుకురావడంపై నరేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పవన్ తన రాజకీయ ప్రసంగంలో కృష్ణను విమర్శించడం తనను షాక్‌కు గురిచేసిందని.. కృష్ణది బంగారం లాంటి మనసని అందరికీ తెలుసునని నరేష్ అన్నారు. కృష్ణ విలువలతో కూడిన రాజకీయం చేశారని.. సినీ , రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని.. కృష్ణ ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదని, తన రాజకీయ ప్రసంగాల్లో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని నరేష్ ట్వీట్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌పై చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. నరేష్ స్పందించారు. కృష్ణను పవన్ అనాలని అనలేదని, మొత్తం వింటే అర్ధమవుతుందని కానీ అది వైరల్ అయ్యిందని నరేష్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌కి మంచి చేయాలనే ఆ ట్వీట్ పెట్టానని .. కేవలం కృష్ణగారి గురించి ప్రస్తావించొద్దు అని మాత్రే అన్నానని , తన మద్ధతు పవన్ కళ్యాణ్‌కేనని పేర్కొన్నారు. ప్రస్తుతం నరేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











