ప్రభాస్ ఎంత మాట అన్నాడో.. డార్లింగ్ గురించి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. కానీ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా సినిమాలు చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచనాలు సృష్టిస్తున్నారు. అయితే ప్రభాస్ ఎంత మంచివారో ఇండస్ట్రీ మొత్తం చెప్పిన సంగతి తెలిసిందే. ఇతర భాషల స్టార్స్ కూడా ప్రభాస్ ను పొగడకుండా ఉండలేకపోయారు. అయితే ఇటీవల తన ప్రసంగాలతో వివాదాల్లో చిక్కుకుంటున్న టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా ప్రభాస్ గురించి మాట్లాడారు. ఆయన మాట్లాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇటీవల రాజేంద్ర ప్రసాద్ పలు వేదికలు, ఈవెంట్లలో కాస్తా వివాదాస్పదంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యలో నితిన్ రాబిన్ హుడ్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల స్టార్ కమెడియన్ అలీని కూడా దుర్భాషలాడాడు. వాటిపైనా స్పందిస్తూ ఎప్పటికప్పుడు వారి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక తర్వాత నుంచి ఎక్కడా, ఎవ్వరికీ అగౌరవంగా మాట్లాడబోనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.

Tollywood Senior Actor Rajendra Prasad Interesting Comments about Prabhas

ప్రభాస్ గురించి రాజేంద్ర ప్రసాద్..
రాజేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. తన కూతురు చనిపోయిన సమయంలో పుట్టెడు శోకంలో ఉండగా ప్రభాస్ వచ్చి ఓదార్చాడన్నారు. బయట ఎక్కువగా కనిపించని ప్రభాస్ తన కూతురు వార్త తెలియగానే వెంటనే వచ్చి పరామర్శించాడని చెప్పారన్నారు. అప్పుడు ప్రభాస్ చెప్పిన మాటలను ఇప్పటికీ మర్చిపోలేనని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 'చావు పుట్టక మన చేతిలో లేవు కదా సార్. అంతా దేవుడి దయ. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు మాకు కావాలి. మీతో చాలా పని ఉంది. మీరు హుషారుగా ఉండాలి.' అని తనశైలిలో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ప్రభాస్ మాటలు తనకు కాస్తా ధైర్యాన్ని ఇచ్చాయని కూడా చెప్పారు.

కన్నప్పతో ప్రభాస్ రచ్చ..
ప్రభాస్ అభిమానులు ఆయన సినిమాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరిగా సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో అలరించారు. ఇక నెక్ట్స్ మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న 'కన్నప్ప' చిత్రంలో రుద్ర పాత్రలో అలరించబోతున్నారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కట్ లో ప్రభాస్ ను చూపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తామంటూ భరసానిస్తున్నారు.

ప్రభాస్ రాబోయే చిత్రాలు..
ప్రస్తుతం ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా తన లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైతే 'ది రాజా సాబ్' మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ జూన్ 16న విడుదల కాబోతోంది. ఇక త్వరలోనే ఫౌజీ షూటింగ్ ను కూడా పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో జాయిన్ కానున్నారు.

More from Filmibeat

Read more about: prabhas rajendra prasad kannappa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X