Jagaati Babu: "ఎలాగోలా పుట్టేసా.. సిగ్గు లేకుండా అడుగుతున్న.. పాలు తాగాలా, మందు తాగాలా"

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు.. అలియాస్ జగ్గూ భాయ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించగల ఈయన తన పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టు పెట్టారు. అందులో చేతిలో రెండు బాటిల్స్ పట్టుకుని ఏది తాగాలో చెప్పమంటూ అడిగాడు. ముఖ్యంగా పాలు తాగాలా, మందు తాగాలా అని నెటిజెన్లను అడుగుతూనే.. అదే తగమని చెప్పమంటూ అడిగాడు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1992లో అసాధ్యులు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు హీరో జగపతి బాబు. సినీ రంగంలో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కొడుకుగానే సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ ఈయన టాలెంట్ తో అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. జగపతి బాబు అంటే రాజేంద్ర ప్రసాద్ కుమారుడు అనే స్థాయి నుంచి జగపతి బాబు తండ్రే రాజేంద్ర ప్రసాద్ అనే స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించి సెపరేట్ ఫ్యాన్స్ ను సంపాధించుకున్నాడు.

Tollywood Senior Hero Jagapati Babu Ask Netizens Whether to Drink Milk or Take Alchohol

గతంలో హీరోగా సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు కొట్టిన ఆయన... దాదాపుగా 100కు పైగా చిత్రాల్లో నటించారు. మొత్తం ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం విలన్ గా కూడా ఇరగదీస్తూ.. సూపర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న జగ్గూ భాయ్.. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాడు. హీరోగా చేస్తే వచ్చిన క్రేజ్ కంటే కూడా విలన్ గా చేసి మరింత పేరు ప్రఖ్యాతలను పొందాడు.

ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు జగపతి బాబు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తూ ఉంటారు. అలాగే తన ట్రెండీ ట్రెండీ లుక్స్ ను కూడా చూపిస్తూ అలరిస్తారు. అయితే తాజాగా ఈయన ఓ పోస్ట్ చేశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా జగ్గూ భాయ్ షేర్ చేసిన ఫొటోలో రెండు బాటిల్స్ పట్టుకుని కనిపించారు.

Tollywood Senior Hero Jagapati Babu Ask Netizens Whether to Drink Milk or Take Alchohol

అందులో ఒకటి పాలది కాగా.. రెండోది మందు బాటిల్. అయితే ఎలాగోలా పుట్టేశాను.. సిగ్గు లేకుండా అడుగుతున్న.. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి.. రెండోది.. ఆలోచింకకుండా క్విక్ గా డిసైడ్ చేయండి ఈ రెండింట్లో ఏది కొట్టమంటారు అంటూ రాసుకొచ్చారు. రెండోది అనడం చూస్తుంటే.. ఆయన రెండోది అంటే మందే కొట్టమని చెప్పినట్లు అర్థం అవుతోంది. మరి మీకు నచ్చిందో ఏదో చూసి చెప్పేయండి.. అదే తాగి బజ్జుంటారేమో జగపతి బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X