ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే స్పెషల్ అప్డేట్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక మార్కెట్ ఉన్న ప్రభాస్ బాహుబలి తరువాత అయినా స్పీడ్ పెంచుతాడు అనుకుంటే అదే తరహాలో స్లోగా అడుగులు వేస్తున్నాడు. బాహుబలి కోసం ఐదేళ్ల సమయం తీసుకున్న ఈ స్టార్ హీరో ఆ తరువాత సినిమాలైనా తొందరగా ఫినిష్ చేస్తాడనుకుంటే మళ్ళీ అభిమానుల ఓపికకు పరిక్ష పెడుతున్నాడు. నెక్స్ట్ సినిమా రాధా కృష దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా పట్టాలెక్కి సంవత్సరం దాటినా కూడా ఇంకా కనీసం టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు. ఆ మధ్య ఎదో ఫస్ట్ లుక్ అంటూ కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు కానీ అవేమి ఆడియెన్స్ ని మెప్పించలేకపోయాయి. ఒకానొక సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ని కూడా బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు దండయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా మరికొన్ని రోజుల్లో ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ అప్డేట్ తో చిత్ర యూనిట్ కిక్కివ్వనుందట.

సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే ప్రభాస్ న్యూ లుక్ ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ పూర్తయిన తరువాత వీలైనంత త్వరాగా షూటింగ్ పనులను పూర్తి చేసుకోవాలని ప్రభాస్ టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్స్ ని సిద్ధం చేస్తున్న చిత్ర యూనిట్ స్పెషల్ అప్డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వాలని చర్చలు జరుపుతోంది. మరి ఆ స్పెషల్ అప్డేట్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











