Jagapathi Babu: "నేను డబ్బున్న పేదవాడిని.. దాని వల్లే నేను ఎటూ కాకుండా పోయా!"

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో, విలన్ జగపతి బాబు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయన అటు హీరోగా, ఇటు విలన్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తాను డబ్బున్న పేద వాడిని అని.. దాని వల్లే తాను అటూ, ఇటూ కాకుండా పోయానని చెప్పుకొచ్చాడు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జగ్గూ భాయ్ సూపర్ డూపర్ హిట్టు చిత్రాలతో నటిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా దగ్గరయ్యాడు. ఒకప్పుడు హీరోగా సందడి చేసిన ఈయన వయసు పెరుగుతున్నా కొద్దీ విలన్ గా మారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గాయం సినిమా నుంచి మొదలుకొని అంతఃపురం, ప్రవరాఖ్యుడు, రంగస్థలం, శ్రీమంతుడు సహా లెజెంజ్ సినిమాల్లో సూపర్ గా నటించి మెప్పించారు.

Tollywood Star Hero Jagapathi Babu Shocking Comments About His Career Check Details

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆయన కెరియర్ గురించి వివరిస్తూ.. సెన్సేషనల్ కామెంట్లు చేసి తన సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. జగపతి బాబు తన కెరియర్ గురించి సినిమాల్లో అవకాశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తాను డబ్బున్న పేద వాడిని అంటూ ఉదహరించారు. తనకు చిన్న సినిమాల్లో నటించాలని చాలానే ఉన్నప్పటికీ.. ఆయన చేతిలో చాలానే పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిపారు.

పెద్ద సినిమాలు షూటింగ్ లు వాయిదా పడుతూ వస్తుండగా.. తాను ఖాళీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ తాను పెద్ద సినిమాలు చేస్తున్నాడని, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారేమోనని చాలా మంది తనకు చిన్న సినిమాల్లో అవకాశాలు ఇవ్వట్లేదని వివరించారు. ఇలా తాను చాలా సినిమాలకు దూరం అవుతున్నట్లు స్పష్టం చేశారు. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన చాలా పెద్ద సినిమాలు తన చేజారిపోయాయని.. అలా ఇప్పుడు తాను ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Tollywood Star Hero Jagapathi Babu Shocking Comments About His Career Check Details

ఇప్పటికైనా ఈ విషయం అర్థం చేసుకుని తనకు అవకాశాలు ఇస్తే.. లెజెండ్ లాంటి సినిమాలు చేయాలని ఉందని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటి వల్ల తాను అటు చిన్న సినిమాలకు, ఇటు పెద్ద సినిమాలకు కూకాండా పోతున్నానని.. ఆవేదన వ్యక్తం చేశారు. చూడాలి మరి జగ్గూబాయ్ చెప్పిన ఈ మాటలు విన్న ఏ దర్శకుడు అయినా ఆయనకు ఛాన్స్ ఇచ్చి మంచి హిట్ కొడతారా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X