twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ లో ఆ స్టార్ హీరోయిన్స్ తో నటించాలని ఉంది: నాగచైతన్య

    |

    గత ఏడాది అక్టోబర్‌లో తన భార్య సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన నాగ చైతన్య చాలా కాలం తరువాత ఆ విషయంలో మీడియా ముందు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బంగార్రాజు సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో ఇవ్వాల్సి రావడంతో సమంతకు సంబంధించిన కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక ఆ విషయంలో నాగచైతన్య చాలా ఓపికతో ఎదురైన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇస్తున్నాడు. ఐదేళ్ల వివాహ బంధానికి విడకులతో తెగదెంపులు చేసుకున్న నాగచైతన్య సమంత ఇద్దరు కూడా ఎవరికి నచ్చిన దారుల్లో వారు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. కేవలం కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక సమంత అయితే పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ తో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

    ఇక విడాకుల అనంతరం ఈ ఇద్దరు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మీడియా ముందు మాత్రం ఎవరు అంతగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక బంగార్రాజు సినిమా ప్రమోషన్ లో తప్పకుండా మీడియా నుంచి అలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని నాగచైతన్య సిద్ధమైనట్లు అనిపించింది. ఇక ఇటీవల ఒక బాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఆన్ స్క్రీన్ బెస్ట్ కెమిస్ట్రీ ఎవరితో అయితే బావుంటుంది అని ఆడిగినప్పడు నాగచైతన్య వెంటనే సమంత పేరు చెప్పడం విశేషం. తప్పక చెప్పాల్సిన ఆ సమాధానంలో సమంత పేరును ప్రస్తావిస్తాడాని ఎవరు ఊహించలేదు.

     tollywood star naga chaitanya about bollywood star heroines

    నాగచైతన్య తన భార్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత చాలా పాజిటివ్ గానే కనిపిస్తున్నాడు. ఎప్పుడు కూడా విచారకరమైన పోస్టులు పెట్టకుండా మీడియా ముందు కూడా సమంత హ్యాపీ నేను హ్యాపీ అంటూ పాజిటివ్ గా స్పందించాడు. దీంతో చైతన్య ఎంత సింపుల్ గా ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.ఇక నాగచైతన్య బంగార్రాజు సినిమాకు పండగ సమయంలో పాజిటివ్ టాక్ వస్తోంది. నాగార్జున తో కలిసి నటించిన ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనా కథకు సీక్వెల్ గా రూపొందింది. ఇక తొలిరోజే సినిమా 10కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు చెబుతున్నారు. రెండవ రోజు కూడా సాలీడ్ వసూళ్లు అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇక నాగచైతన్య బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మరియు కరీనా కపూర్ ఖాన్ ల లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చైతన్యకు ఇదే మొదట బాలీవుడ్ సినిమా. ఇక బాలీవుడ్ స్టార్ నటీమణులలో అలియా భట్ దీపికా పదుకొణెతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని కూడా చైతూ ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు. బంగార్రాజు సినిమా అనంతరం నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమాతో రానున్నాడు. ఈ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. అంతే కాకుండా ఒక హారర్ వెబ్ సీరిస్ లో కూడా నటించనున్నట్లు సమాచారం. పరశురామ్ - మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో కూడా నాగ చైతన్య ఒక సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్నాడు.

    English summary
    tollywood star naga chaitanya about bollywood star heroines..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X