రవితేజను కోట్లలో మోసం చేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఆ విషయం తెలిసిన హీరో ఏం చేశాడంటే?
మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించగల సత్తా కల్గిన ఈయన.. నిజ జీవితంలో చాలా భోళాగా ఉంటారని చాలా మంది చెబుతుంటారు. అయితే ఓ స్టార్ ప్రొడ్యూసర్ రవితేజను కోట్లలో మోసం చేశాడు. ఆయనకు తెలియకుండా మోసపోయిన రవితేజ.. ఆ విషయం తెలుసుకుని ప్రొడ్యూసర్ పై షాకింగ్ గా రియాక్ట్ అయ్యారట. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ కు చెందన ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను రవితేజ చాలా క్లోజ్. ఈ క్రమంలోనే మాస్ మాహారాజ భూమి కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు ఆయనకు చెప్పాడట. దీంతో ఆయనే ఓ చోట 25 ఎకరాల భూమిని చూపించి కొనుక్కోమన్నారట. ఆ పక్కనే అదే ప్రొడ్యూసర్ కు 35 నుంచి 40 ఎకరాల వరకు ఉందట. దీంతో ఇద్దరికీ పక్కపక్కనే భూమి ఉంటుంది కదా అని భావించిన రవితేజ ఆయన చెప్పినట్లుగానే భూమి కొనుగోలు చేశాడట.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. కొంత కాలం తర్వాత మాత్రం ఆ ప్రొడ్యూసర్ ఈ భూమిని అమ్మేయాలనుకున్నాడట. అయితే తన భూమిని అమ్మాలనుకుంటే ఆ పక్కనే ఉన్న.. మాస్ మాహారాజా రవితేజ భూమి కూడా కావాలని కొనుగోలు దారులు అడిగారట. దీంతో ప్రొడ్యూసర్ ఓ అదిరిపోయే ప్లాన్ వేసి ఆ భూమిని.. రవితేజ అమ్మేలా చేశారు. ముఖ్యంగా అది ప్రభుత్వం కిందకు పోతుంది.. మనిద్దరం అమ్మేద్దాం అని చెప్పి.. రవితేజ ఇష్టంగా కొనుకున్న పాతికెకరాల భూమిని అమ్మేయించాడట.
అయితే ఇదంతా తెలియని రవితేజ మాత్రం తనకు ఇష్టం లేకపోయినా భూమిని అమ్మేశాడట. కానీ కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ కు రవితేజను మోసం చేసినట్లు అనిపించిందట. తాను తప్పు చేశానని చాలా ఫీలైన అతడు... నేరుగా హీరో వద్దకు వెళ్లి నేను నిన్ను మోసం చేశానని చెప్పాడట. అయితే చాలా కోప్పడి తిట్టాల్సిన రవితేజ మాత్రం.. దీనిపై చాలా కూల్ గా స్పందించారట. నాకు తెలుసు అంటూ నవ్వు మొహం పెట్టి అతడిని వదిలేశాడట. రవితేజ బిహేవియర్ చూశాకా ఆ ప్రొడ్యూసర్ కు మరింత తప్పు చేశానన్న భావన కల్గిందట.

అయితే గతంలో అదే ప్రొడ్యూసర్ తో రవితేజ సినిమా చేయగా.. బ్లాక్ బస్టర్ హిట్ అయి 5 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. ఆ హీరో వల్ల అంత లాబాలు ఆర్జించిన నేను.. అతడిని మోసం చేసి తప్పు చేశానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ఆయన రుణం కచ్చితంగా తీర్చుకుంటానని... భవిష్యత్తులో ఆయన కోసం ఏదైనా చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ స్టార్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు బండ్ల గణేష్. ఆయన రవితేజను మోసం చేశారట.


Click it and Unblock the Notifications











